Home » గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన TSPSC.. ఎప్పటి నుంచి అంటే..?

గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల చేసిన TSPSC.. ఎప్పటి నుంచి అంటే..?

by Anji
Ad

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూపు 1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ ని విడుదల చేసింది. వచ్చే జూన్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్ 05 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అందులో జూన్ 11 ఆదివారం కావడంతో ఆ రోజు పరీక్ష ఉండదు అని వెల్లడించింది. 

Advertisement

గ్రూప్-1 మెయిన్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో జరుగుతాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. జనరల్ ఇంగ్లీషు పేపర్ తప్పా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్నటువంటి భాషలో పరీక్ష రాయవచ్చని పేర్కొంది. గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకి హాజరయ్యారు. గ్రూపు1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఒక్కో పోస్ట్ కి మెయిన్స్ కి 50 మంది చొప్పున సెలక్ట్ చేసింది. ప్రిలిమ్స్ హాజరైన వారిలో 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది. 

Advertisement

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం.. జూన్ 05న జనరల్ ఇంగ్లీష్ అర్హత పరీక్ష, జూన్ 06న జనరల్ ఎస్సే (పేపర్-1), జూన్ 07న హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ (పేపర్ 2), జూన్ 08న ఇండియన్ సొసైటీ, కాన్ స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ( పేపర్ 3), జూన్ 09న ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ (పేపర్ 4) జూన్ 10న సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డాటా ఇంటర్ ప్రిటేషన్ ( పేపర్ 5), జూన్ 12న తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం ( పేపర్ 6) అంశాలపై పరీక్షలుంటాయి. 

Also Read :   TSPSC Group-4 : గ్రూప్ 4 అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తుల గడువు పొడగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే

Visitors Are Also Reading