Home » TSPSC Group-4 : గ్రూప్ 4 అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తుల గడువు పొడగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే

TSPSC Group-4 : గ్రూప్ 4 అభ్యర్థులకు శుభవార్త.. దరఖాస్తుల గడువు పొడగింపు.. చివరి తేదీ ఎప్పుడంటే

by Bunty
Ad

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణ రాష్ట్రం ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ గ్రూప్-4 పోస్ట్ ల కోసం దరఖాస్తుల స్వీకరణకు సోమవారం అంటే జనవరి 30వ తేదీతో గడువు ముగియాల్సి ఉంది. ఈ తరుణంలో తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. అయితే ఈ సోమవారం రోజే ఏకంగా 34,247 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ క్రమంలోని టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Advertisement

అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న అధికారులు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. ఫిబ్రవరి 3వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటివరకు మొత్తం 8,47,272 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

తాజాగా దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో సర్వర్ పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. కాగా, ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత కూడా మరో రెండు రోజులు గడువు పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతోంది.

READ ALSO : వాషింగ్టన్ సుందర్… పేరు వెనక ఇంత రహస్యం ఉందా? అతనికి చెవులు కూడా వినిపించవు !

Visitors Are Also Reading