Home » Green Tea : గ్రీన్ టీ లో ఈ ఒక్కటి కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Green Tea : గ్రీన్ టీ లో ఈ ఒక్కటి కలిపి తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా..?

by Mounika
Ad

Green tea : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వాతావరణ కాలుష్యం మరియు అస్తవ్యస్తమైన జీవనశైలితో  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీని కారణంగా బరువు పెరగడం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు లోనవుతున్నారు.  అలాగే ఇలాంటి పరిస్థితుల నుంచి బయట పడడానికి నేటి కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు.  ప్రతిరోజు వ్యాయామం చేయడంతోపాటు యోగా, ధ్యానం లాంటివి చేయటం రోజువారి జీవితంలో భాగంగా చేర్చుకుంటున్నారు. ఇక వీటితో పాటు ఒంటిలో ఉన్న టాక్సిన్స్ ని తొలగించడానికి   ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు. అసలు ఎక్కువమంది గ్రీన్ టీ త్రాగడానికి ఎందుకు అంత ఆసక్తి చెబుతున్నారు. దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

గ్రీన్ టీలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు చాలా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ బి5, విటమిన్ కె, రిబోఫ్లావిన్, థయామిన్, మాంగనీస్, పొటాషియం, కాపర్, ఐరన్, ఆక్సిడెంట్, పాలీఫెనాల్ వంటి మూలకాలు ఉన్నాయి. ఇవి మీకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించడానికి కారణమవుతాయి. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి పని చేస్తాయి.

Advertisement

గ్రీన్ టీని రోజు  నిమ్మరసం కలిపి  తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది. ఇందులో పాలీఫెనాల్ శరీర జీవక్రియను సక్రమంగా పనిచేయడానికి ప్రోత్సహించి శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది   ఇందులో కొవ్వు మరియు పిండి పదార్థాలు ఉండవు. గ్రీన్ టీ తీసుకోవడం వలన కొవ్వు ఏర్పడకుండా నిరోధించడానికి  ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో కూడా సహాయపడుతుంది.

గ్రీన్ టీ రెగ్యులర్గా తీసుకోవడం వలన   బిపి కూడా నియంత్రణలో ఉంటుంది. అందువల్ల హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ మరియు అమినో యాసిడ్స్ శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. దీంతో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజూ గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శారీరక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

Also Read :

ఇలాంటి వారు వంకాయ అస్సలు తినకూడదు.. తింటే ఇబ్బందుల్లో పడినట్లే..!

తలస్నానం చేసినప్పుడల్లా.. జుట్టు రాలిపోతోందా..? అయితే ఇలా చేయండి..!

Health Tips: పులిపిరులు ఎందుకు వస్తాయి? వీటిని తొందరగా ఎలా వదిలించుకోవాలి?

Visitors Are Also Reading