Home » Health Tips: పులిపిరులు ఎందుకు వస్తాయి? వీటిని తొందరగా ఎలా వదిలించుకోవాలి?

Health Tips: పులిపిరులు ఎందుకు వస్తాయి? వీటిని తొందరగా ఎలా వదిలించుకోవాలి?

by Srilakshmi Bharathi
Ad

చర్మంపై చిన్న పాపుల్స్‌ను పోలి ఉండే చిన్న పెరుగుదలను గమనిస్తే, వాటిని పులిపిరి అంటుంటాం. చూడగానే ఇవి ప్రమాదకరం కాదు అని అందరు తేల్చేస్తూ ఉంటారు. కానీ, వాటి అంతర్లీన కారణం, వాటి వల్ల వచ్చే ప్రమాదాల గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) చేత ప్రేరేపించబడిన ఈ చర్మ వ్యాధి వివిధ శరీర భాగాలపై కనిపిస్తుంది. ముఖ్యంగా చేతులు, కాళ్ళు, మెడపైన వస్తూ ఉంటాయి. కొంతమందిలో కంటి చుట్టూ, కనురెప్పల పై కూడా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఇవి వాటంతట అవే పోతాయి.

Advertisement

కొన్ని సార్లు వీటికి తగిన చికిత్స తీసుకోకపోతే కాన్సర్ గా మారి ప్రాణాంతకం అవుతాయి. కొన్ని రకాల పులిపిరులు ఉన్న వారు వాడిన టవల్స్, సోప్స్ మరొకరు వాడినా కూడా అవి ఇతరులకు కూడా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు పులిపిరులు ప్రమాదకరం కాదు. కేవలం కొన్ని నిర్దిష్ట రకాలకు చెందిన పులిపిరులు మాత్రమే హానిని కలిగిస్తాయి.
జననేంద్రియ పులిపిరులు మరియు HPV ఇన్ఫెక్షన్లు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి, వీటిలో యానల్, గర్భాశయ మరియు గొంతు క్యాన్సర్లు ఉంటాయి.

Advertisement

జననేంద్రియ పులిపిరులు కొనసాగితే మరియు అవి వైద్యానికి స్పందించకపోతుంటే.. కాన్సర్ సంబంధిత ట్రీట్ మెంట్ ను తీసుకోవడానికి వైద్యులను వెంటనే సంప్రదించాలి. ఇవి కాకుండా కోతలు, పగిలిపోతున్న పులిపిరులు బ్యాక్తీరియా, ఫంగస్ ప్రవేశానికి దారిని ఏర్పాటు చేస్తాయి. అందుకే వీటి నుంచి రక్షణ పొందాలి. చాలా సందర్భాలలో ఇవి ఎలాంటి చికిత్స లేకుండానే పోతూ ఉంటాయి. కానీ, వీటిని పూర్తిగా వదిలించుకోవడానికి క్రయో థెరపీ, లేజర్ థెరపీ, ఇమ్యునోథెరపీ, లిక్విడ్ రసాయనాలు మరియు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో, సరైన చికిత్స తీసుకుని పులిపిరుల బారి నుంచి రక్షించుకోవాలి.

మరిన్ని..

చంద్రముఖి 2ని రజనీకాంత్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?

31 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చిన మహిళ 90 ఏళ్లలో డెలివరీ.. ఆశ్చర్యపోయిన వైద్యులు..!

Visitors Are Also Reading