తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్..హైదరాబాద్ లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల అయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్న యంగ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో పోస్టులను తీసుకొనున్నారు. ఏ ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఇప్పుడు చూద్దాం.
read also : ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !
Advertisement
Advertisement
read also : ఉద్యోగికి రూ. 1500 కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ముఖేష్ అంబానీ
ఖాళీలు, అర్హతలు…
నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 141 యంగ్ ఫెలో పోస్టులను భర్తీ చేయనున్నారు. పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పీజీతో పాటు పీజీ డిప్లమా ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే ఇంగ్లీష్, హిందీ భాషల్లో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 01-04-2023 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
READ ALSO : ఛార్మి వల్లేనా ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోలేదు?