తెలంగాణ రైతులకు శుభవార్త అనే చెప్పాలి. రైతుబంధు పథకం ద్వారా ఈసారి రైతులకు ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని వానాకాలంలో సాగుకోసం త్వరలోనే ప్రభుత్వం అందజేయనున్నది. జూన్ మొదటివారంలో లబ్దిదారులతో పాటు కొత్తగా అర్హత కలిగిన వారిని గుర్తించి చెక్కులు, నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రెడీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 66.61 లక్షల మంది రైతులకు సంబంధించిన డేటా ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం వద్ంద వివరాలను అప్‌డేట్ చేయడంతో కొత్త లబ్దిదారులకు అవకాశం కల్పించడంపై వ్యవసాయ శాఖ భావిస్తోంది.
జూన్ మాసంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. అదేవిధంగా రైతులకు అదే నెల తొలివారంలో రైతు బంధు నగదును బ్యాంకుఖాతాల్లో జమా చేస్తు బాగుంటుందని వారికి సరైన సమయానికి ఉపయోగపడుతుందని భావిస్తోంది. రైతుబంధు పథకం మొదలుపెట్టిన సంవత్సరం మే నెలలోనే లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేసింది. వర్షాకాలం సాగు పెట్టుబడి నిధులను జూన్, జులై నెలల్లో యాసంగి వ్యవసాయానికి పెట్టుబడి సాయాన్ని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అందజేస్తుంది. 2018 నుంచి రైతుబంధు అమలులోకి తెచ్చినప్పటికీ కొన్ని సార్లు నగదు విషయంలో ఆలస్యం అయింది.
రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న డేటా ప్రకారం.. యాసంగి సీజన్‌కే 66.61లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలున్నాయి. 152.91 లక్షల ఎకరాలకు రైతులు యాజమాన్య హక్కులు కలిగి ఉన్నారు. గత యాసంగిలో రైతుబంధు పథకం కింది ప్రభుత్వం 62.99 లక్షల మంది రైతులకు రూ.7,411.52 కోట్లు రూపాయలు అందజేసింది. కోటి 48లక్షల 23వేల ఎకరాలకు పెట్టుబడి సాయం అందజేసింది. సాంకేతిక సమస్యల కారణంగా పలువురు రైతులకు సాయం అందలేదు.
రైతుబంధు అర్హుల సంఖ్య ఈ సారి వానాకాలం సీజన్‌లో మరింత పెరగనున్నది. దాదాపు 65 లక్షల మందికి రైతుబంధు పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం లెక్కలను చూపిస్తోంది. దాదాపు 7,600 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పంట పెట్టుబడి సాయాన్ని ఏకకాలంలోనే ఇవ్వడానికి ఆర్థికశాఖ కసరత్తు చేస్తుంది. గడిచిన రెండు విడుదల్లో రోజుకొక ఎకరం చొప్పున పెంచుకుంటూ వారం, పది రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో నగదు జమ చేయనున్నారు. డేటాను డివైడ్ రెండు, మూడు విభాగాలుగా మార్చుతుంటారు. ఎకరం పొలమున్న రైతు నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలతో పాటు 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు 10 విడుతలుగా ప్రభుత్వం రైతుబంధు అందించనున్నది.
ఇక యాసంగిలో రైతుబందు పంపిణీ చేసిన తరువాత పాస్ పుస్తకాలు పొందిన వారు, కొత్తగా పాస్ పుస్తకాలు అందుకున్న వారికి ఈ సారి లబ్ధిదారుల జాబితాలో చేర్చి నగదును జమ చేయనున్నది. పొలాల కొనుగోలు, అమమకాల ద్వారా యాజమాన్య హక్కులు మారిపోయినా.. ధరణి పోస్టర్ ద్వారా కొత్తగా యాజమాన్య హక్కులొచ్చినా ఆ వివరాలను రైతుబందు పోర్టల్‌లో నమోదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. యాజమాన్య హక్కులు పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్సుకాపీలు సంబంధిత బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులకు అందజేస్తే వారు పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఇక ధరణి పోర్టల్‌లో డిజిటల్ సంతకం పూర్తి అయిన తరువాత రైతుబందుకు అర్హత పొందుతారు.
Also Read :
Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు పట్టుదల అసలు వదలకూడదు
టాలీవుడ్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!