Home » టాలీవుడ్ లో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!

టాలీవుడ్ లో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌చ్చి డిజాస్ట‌ర్ లుగా నిలిచిన 5 సీక్సెల్స్ ఇవే..!

by AJAY
Ad

టాలీవుడ్ లో సీక్వెల్స్ జోరు ఇప్పుడు ఎక్కువ‌గా కనిపిస్తోంది. నిజానికి సీక్వెల్స్ ట్రెండ్ మాత్రం ఎప్పుడో మొద‌ల‌య్యింది. అయితే అప్పుడు సీక్వెల్స్ కు పెద్దగా ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించ‌లేదు.

Advertisement

అంతే కాకుండా టాలీవుడ్ లో ఎన్నో అంచనాల మ‌ధ్య వ‌చ్చిన 5 సీక్సెల్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆ సీక్వెల్స్ ఏవో ఇప్పుడు చూద్దాం…


మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిన శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ మ్యాన‌రిజం… కామెడీ టైమింగ్ హైలెట్ అనే చెప్పాలి. ఈ సినిమా త‌ర‌వాత సీక్వెల్ గా శంక‌ర్ దాదా జిందాబాద్ ఎన్నో అంచనాల మ‌ధ్య ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. కానీ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చిన ప్రేమక‌థాచిత్రం ఆర్య బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సినిమా బ‌న్నీ కెరీర్ ను నిల‌బెట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా ఎన్నో అంచనాల మ‌ధ్య ఆర్యా-2 తెర‌కెక్కింది. కానీ ఆర్యా-2 మాత్రం అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేక‌పోయింది.

Advertisement


ర‌వితేజ హీరోగా న‌టించిన కిక్ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన కిక్-2 మాత్రం అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింది.

తెలుగులో వ‌చ్చిన కాప్ స్టోరీతో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం పోలీస్ స్టోరీ. సాయికుమార్ హీరోగా న‌టించిన ఈ సిన‌మాకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమాకు సీక్వెల్ గా వ‌చ్చిన పోలీస్ స్టోరీ-2 మాత్రం ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.


ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. కానీ ఈ సినిమాకు సీక్వెగ్ వ‌చ్చిన స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

ALSO READ :

హైదరబాద్ లో అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా రెండో స్థానంలో సర్కారువారిపాట..టాప్ 5 స్థానాల్లోని సినిమాలు ఇవే..!

వైఎస్ఆర్ నిజంగా ఆ డైలాగ్ చెప్పాడా…? పరుశురామ్ కామెంట్స్ పై నెటిజన్లు ఫైర్…!

Visitors Are Also Reading