Home » లింగమయ్య భక్తులకు శుభవార్త.. ఇక నుంచి ఏడాదంతా దర్శనం !

లింగమయ్య భక్తులకు శుభవార్త.. ఇక నుంచి ఏడాదంతా దర్శనం !

by Anji
Ad

తెలంగాణ అమర్ నాథ్ యాత్రగా పేరు పొందిన నల్లమల్లలోని సలేశ్వరం లింగమయ్య యాత్రను ఇక నుంచి నిత్యం భక్తులకు అందుబాటులో ఉంచేందుకు అటవీ శాఖ ప్రణాళిక రూపొందిస్తుంది. అటు పర్యావరణానికి.. ఇటు వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రూపొందించింది. ఈ ప్రత్యేక పర్యాటక ప్యాకేజీని ఉన్నతాధికారులు అనుమతిస్తే సుమారు నెలల తరబడి భక్తులు నల్లమలలో సాహస యాత్ర చేపట్టేందుకు ఆస్కారం ఉంది.  

Also Read  :  Adipurush : ఆది పురుష్ కు అరుదైన గౌరవం…

Advertisement

స్థానికంగా ఉండే చెంచులకు విస్తృతంగా ఈ ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అటవీశాఖ వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందులో భాగంగానే సలేశ్వరం లింగమయ్య దర్శనానికి టూరిజం ప్యాకేజ్ ద్వారా అవకాశం కల్పించడంపై అటవీ శాఖ దృష్టి సారిస్తోంది.నల్లమల్ల లోతట్టు ప్రాంతంలో ఎత్తైన కొండలు, లోయల మధ్య ఉన్న ఈ లింగమంతుల స్వామిని దర్శించుకోవాలంటే భక్తులు పెద్ద సాహసమే చేయాలి. లింగమయ్య సన్నిధిలో ఎత్తైన కొండల నుంచి జాలువారే సలేశ్వర తీర్థం జలపాతం, అక్కడకు చేరేందుకు పడిన శ్రమను మైమరిపించేలా చేస్తుంది. ప్రతి సంవత్సరం ఉగాది తర్వాత వచ్చే చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా చెంచులు లింగమయ్యకు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. 

Advertisement

Also Read :  దర్శకుడు సుకుమార్ పై IT దాడులు.. ఆ MLAలు కారణమని మీకు తెలుసా..?

గతంలో వారం రోజులపాటు ఈ జాతర ఉత్సవాలు నిర్వహించగా..  కరోనా తరువాత అటవీశాఖ కేవలం మూడు రోజులకే పరిమితం చేసింది. ఏడాదిలో కేవలం మూడు రోజుల పాటు లింగమయ్య దర్శనం ఉండడంతో లక్షలాది సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇరుకైన లోయల మధ్య ప్రయాణం, దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షణ నేపథ్యంలో తరచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల నిర్వహించిన ఉత్సవాల సందర్భంగా ముగ్గురు భక్తులు మరణించగా.. గత 8 ఏళ్లలో 9 మంది మృతి చెందారు.  అడవిలోని వన్యప్రాణుల సంతానోత్పత్తికి వర్షాకాలం ప్రారంభమయ్యాక జూలై నుంచి అక్టోబర్ చివరి వరకు అనుకూలమైన కాలం. ఈ సమయంలో మినహాయించి మిగతా కాలంలో ఈ ప్యాకేజీని అమలు చేసే ఆచరణలో అటవీశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. చెంచుల ఆరాధ్య దైవంగా నల్లమలలో కొలువుదీరిన సలేశ్వర లింగమయ్య దర్శనానికి సుదీర్ఘకాలం పాటు అవకాశం కల్పించేందుకు స్థానిక ఆలయ కమిటీ నుంచి ఆమోదం లభించినట్టు సమాచారం. 

Also Read :  భట్టి విక్రమార్క:కాంగ్రెస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది..సీఎం ఆయనేనా..?

Visitors Are Also Reading