Home » పద్మ అవార్డుని గెలుచుకున్న వారికి ఈ సదుపాయాలు ఉంటాయా ? ప్రభుత్వం ఇవ్వబోతున్నవి ఇదే !

పద్మ అవార్డుని గెలుచుకున్న వారికి ఈ సదుపాయాలు ఉంటాయా ? ప్రభుత్వం ఇవ్వబోతున్నవి ఇదే !

by Anji

పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. అవార్డు విన్నర్‌లకు నగదు ప్రొత్సాహాన్ని అందిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ.25లక్షల నగదు బహుమతి ఇస్తున్నట్టు చెప్పారు. ప్రతి నెలా వారి ఖర్చుల కోసం రూ.25వేల పెన్షన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. పేద కవులకు, కళాకారులకు చప్పట్లు, దుప్పట్లే చివరకు మిగులుతున్నాయని.. అందుకే ఆర్థికంగా కూడా అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. పద్మ అవార్డు గ్రహీలను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించడం ఇదే తొలిసారి.

 150 కి పైగా సినిమాలు చేసినా చిరంజీవిలో అదే కమిట్ మెంట్ ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధి, అంతరించిపోతున్న కళలను ప్రోత్సహిస్తామని తెలిపారు. భాష విషయంలో వెంకయ్యనాయుడు సూచనలను స్వీకరిస్తామని పేర్కొన్నారు.  రాజకీయాల్లో వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి పదునైన భాషతో ప్రజా సమస్యలపై మాట్లాడేవారని తెలిపారు. రాష్ట్రపతికి కావాల్సిన అన్ని అర్హతలు వెంకయ్యనాయుడుకు ఉన్నాయన్న రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఈ ఐదుగురికి పెన్షన్‌ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న తర్వాత కూడా చాలామంది పద్మ అవార్డు గ్రహీతలు, కళాకారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు బహుమతి, పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

Visitors Are Also Reading