Home » రెడ్ హ్యాండెడ్ గా హోటల్లో దొరికిపోయిన గిల్, సారా?

రెడ్ హ్యాండెడ్ గా హోటల్లో దొరికిపోయిన గిల్, సారా?

by Anji
Ad

భారత స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా.. యంగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ తో రిలేషన్ లో ఉన్నట్టు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వీటికి మరింత బలాన్ని చేకూర్చేవిధంగా తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వీరిద్దరూ కలిసి ఓ హోటల్ నుంచి బయటికీ వస్తుండగా కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. ఇందుకు సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో జనాలు వైరల్ చేస్తున్నారు.

Advertisement

ఇక శుభ్ మన్ గిల్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మతో పాటు గిల్ కూడా టీమిండియాకు చాలా కీలకంగా మారాడు. అయితే సారా పూణే వేదికగా జరిగిన మ్యాచ్ కి తన ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లింది. ఫీల్డింగ్ సమయంలో గిల్ క్యాచ్ పట్టగా సారా ఎగిరి గంతులేసింది. బ్యాటింగ్ లో గిల్ రెండు సిక్సర్లు కొట్టగా.. రెండుసందర్భాల్లో కూడా సారా చప్పట్లతో అతన్ని ప్రోత్సహిస్తూ.. కేరింతలు కొట్టింది. కొద్ది రోజుల పాటు వీరిద్దరికీ బ్రేకప్ అయిందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ మ్యాచ్ తో మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అర్థం అయిపోయింది. తాజాగా వీరిద్దరూ రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కలల ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద లగ్జరీ మాల్ జియో వరల్డ్ ప్లాజా ప్రారంభోత్సం కార్యక్రమంలో గిల్, సారా కనిపించారు.

Advertisement

సారా రెడ్ డ్రెస్ లో కనిపించగా.. గిల్ టీషర్ట్, బ్లాక్ కలర్ జీన్స్ ధరించాడు. గిట్ ఎంట్రెన్స్ గేట్ నుంచి బయటికీ వస్తుండగా.. సారా తన స్నేహితులతో ఎంట్రీ గేట్ వద్ద కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. మరోవైపు భారత జట్టు తన తరువాత మ్యాచ్ లో శ్రీలంక జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ నవంబర్ 02న ముంబైలోని వాంఖడే మైదానంలో జరుగనుంది. ప్రస్తుతం భారత జట్టు ముంబైలో ఉంది. ఈ నేపథ్యంలోనే గిల్ ఈ కార్యక్రమానికి హాజరైనట్టు తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలో మంచి ఫామ్ లో ఉన్న గిల్ వరల్డ్ కప్ లో మాత్రం కాస్త తడబడుతున్నట్టు కనిపిస్తున్నాడు. ఇప్పటివరకు 4 మ్యాచ్ ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు గిల్. ముందు ముందు ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడో వేచి చూడాలి.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading