Home » కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

కేకేఆర్ ను ఎలన్ మస్క్ కొనాలి అంటూ డిమాండ్…!

by Azhar

ఐపీఎల్ 2022 లో ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్ చాలా దారుణంగా ఆడుతుంది. అయితే ఈ సీజన్ ను మంచిగానే ప్రారంభించిన కేకేఆర్ ప్రస్తుతం వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది. ఇప్పటికే ఆడిన 9 మ్యాచ్ లలో 6 ఓడిపోయిన కేకేఆర్ వరుసగా 5 ఓటములను చవి చూసింది. బౌలింగ్ లో ఈ జట్టు పర్వాలేదు అనిపిస్తున్న.. బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలమవుతుంది.

నిన్న ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో ఆది స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన కోల్‌కతా జట్టులో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పర్వాలేదు అనిపిస్తే.. నితీష్ రానా అర్ధశతకంతో మెరిశాడు. ఇక మిగిలిన వారు ఎవరి అంతగా రాణించకపోవడంతో కేవలం 146 పరుగులే చేసిన కోల్‌కతా ఢిల్లీ చేతిలో ఓడిపోయింది.

 

దాంతో ఈ జట్టుపై మిమర్స్ తెగ రెచ్చిపోతున్నారు. జట్టు పాట్ కమిన్స్ ను పక్కన పెట్టడంపై విమర్శిస్తున్న అభిమానులు.. ట్విట్టర్ ను కొనుకొని ట్రేండింగ్ లో ఉన్న ఎలన్ మస్క్ ను… ఈ కేకేఆర్ జట్టును కూడా కొనుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు. దాంతో ఇప్పుడు ఐపీఎల్ లో కూడా ఎలన్ మస్క్ పేరు తెర మీదకు వచ్చింది.

ఇవి కూడా చదవండి :

ముంబై జట్టుకి షాక్.. ఆ పేసర్ సీజన్ కి దూరం..!

జమ్మూలో గాలించండి.. ఇంకా దొరుకుతారు కావచ్చు..?

Visitors Are Also Reading