ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 80వ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఉత్తర కొరియాలోని ఇంజియోన్ నగరంలో నిర్వహించారు. శీతాకాలం కావడంతో సంజియోన్ నగరంలో పెద్ద ఎత్తున మంచు కురుస్తూ ఉంది. అత్యంత కఠిన హృదయుడు అయిన కిమ్ జోంగ్ ఉన్ గడ్డ కట్టే చలిలో ఆరు బయట తన తండ్రి విగ్రహం ముందు దాదాపు అరగంట సేపు వేడుకలను నిర్వహించారు.
Also Read : హీరోగా సక్సెస్ బిజినెస్ లో ఫెయిల్….”ట్రూజెట్” కోసం చరణ్ తిప్పలు..!
Advertisement
Advertisement
పెద్ద ఎత్తున ఈ వేడుకలకు ప్రజలు హాజరయ్యారు. అయితే నెత్తిమీద ఎలాంటి ఉన్న దుస్తులు లేకుండా చలిలో ప్రజలు అలాగే నిలబడిపోయారు. వేడుకలకు హాజరైన వారందరూ వారు అక్కడి నుంచి కదిలితే ఏమవుతుందో అందరికీ తెలిసినదే. చావడం కంటే కష్టపడి చలిని ఓర్చుకోవడమే మేలు అని ప్రజలు వణుకుతూనే చలిలో నిలబడిపోయారు. అయితే ప్రసంగించే గ్యాలరీ అధికారులు కూర్చున్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద హీటర్లు పెట్టారు.
Also Read : ఐఎస్ఐ చీఫ్‌ను దాచిన ఇమ్రాన్ ఖాన్..!