Home » ఐఎస్ఐ చీఫ్‌ను దాచిన ఇమ్రాన్ ఖాన్‌..!

ఐఎస్ఐ చీఫ్‌ను దాచిన ఇమ్రాన్ ఖాన్‌..!

by Anji
Ad

మైక్రోసాప్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్ ఇటీవ‌ల తొలిసారి పాకిస్తాన్‌లో ప‌ర్య‌టించారు. పాక్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ గేట్స్‌కు ఆతిథ్యం ఇచ్చారు. పాకిస్తాన్ క్యాబినెట్ మంత్రులు కూడా హాజ‌ర‌య్యారు. ఇమ్రాన్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఇందులోనే అస‌లు ర‌హ‌స్యం దాగి ఉంది. పాక్ ప్ర‌ధాని షేర్ చేసిన ఫొటోలో ఓ వ్య‌క్తిని మార్ఫు చేసిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.


ముఖ్యంగా ఈ ఫొటోలో బిల్‌గేట్స్‌, ఇమ్రాన్ ఖాన్ ష‌హా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంద‌రూ ఆ వ్య‌క్తి వైపై చూస్తున్న‌ట్టుగా ఉండ‌డంతో ఆ వ్య‌క్తి ఎవ‌రై ఉంటారా అనే ఆస‌క్తి మొద‌లైంది. ఎందుకు మార్చ్ చేశారా అన్న గంద‌ర‌గోళం త‌లెత్తింది. ఆయ‌న ఐఎస్ఐ చీఫ్ లెప్టినెంట్ న‌దీమ్ అని ఈ స‌మావేశంలో సంబంధం ఉన్న వ్య‌క్తులు కొంద‌రూ పాక్ మీడియాకు తెలిపినట్టు స‌మాచారం.

Advertisement

Advertisement

న‌దీమ్ అంజుమ్ గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లో ఐఎస్ఐ నూత‌న చీఫ్ గా నియ‌మితుల‌య్యారు. అంత‌కుముందు ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న ఫ‌యాజ్ హ‌మీద్ పాక్ ఆర్మీ చీఫ్ జ‌న‌ర‌ల్ బ‌జ్వాల‌కు మ‌ధ్య వ‌ర్గ‌పోరు మొద‌ల‌వ్వ‌డంతో హ‌మీద్‌ను ప‌ద‌వీ నుంచి త‌ప్పించారు. స్థానంలో న‌దీమ్ నియ‌మకాన్ని తొలుత ఆర్మీ మీడియా వింగ్ ప్ర‌క‌టించ‌గా.. ఆ త‌రువాత కొన్నాళ్లకు ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వం ధృవీక‌రించింది. దీంతో ప్ర‌భుత్వానికి, ఆర్మీకి మ‌ధ్య అంత‌ర్గ‌త పోరు మొద‌లైన‌ట్టు వార్త‌లు వినిపించాయి.

Also Read :  జ‌గ్గారెడ్డి రివ‌ర్స్ గేర్‌.. సోనియా, రాహుల్ గాంధీల‌కు లేఖ‌

Visitors Are Also Reading