తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పలు యూనిట్లను ప్రారంభించాయి. మరోవైపు కీలక ఒప్పందాలు జరిగిపోతున్నాయి. తాజాగా మరో భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు గురువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆ సంస్థ చైర్మన్ పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
READ ALSO : Virupaksha Teaser : “విరూపాక్ష” టీజర్ వచ్చేసింది… మరీ ఇంత సస్పెన్సా..?
Advertisement
రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయు కుదుర్చుకున్నారు. తాజా పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి ఉపాధి కల్పిస్తామని ఫాక్స్ కాన్ సంస్థ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా Hon Hai Fox Conn సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. తద్వారా ఒక లక్ష ఉద్యోగాల కల్పనకు దారులు వేసింది.
Advertisement
READ ALSO : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!
దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. ఎలక్ట్రానిక్స్ రంగంలో దేశంలోకి వచ్చిన అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్ష మందికి నేరుగా ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్ హై ఫాక్స్ కాన్’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
READ ALSO : IND VS AUS : ఓటమి ముంగిట ఇండియా.. రోహిత్ చేసిన ఈ 3 తప్పిదాలు ఇవే