Home » మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి… సూపర్ టైటిల్ పెట్టారుగా!

by Bunty
Ad

టాలీవుడ్ యువ హీరో నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి క్రేజీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా చెప్పినట్టుగానే అదిరిపోయే లుక్ తో సినిమా అప్డేట్ అందించి మూవీ లవర్స్ లో జోష్ నింపుతున్నాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాకు మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి టైటిల్ ఫైనల్ చేశారు. నేను మిమ్మల్ని చూసి చాలా కాలం అయింది. కారణమేంటంటే మేము మీకు థియేటర్లలో అత్యుత్తమ వినోదాన్ని అందించేందుకు కష్టపడుతున్నాము.

READ ALSO : Samantha: సమంత చేతులకు గాయాలు.. రక్తంతో షాకింగ్ పోస్ట్

Advertisement

ఈ సమ్మర్ 2023లో థియేటర్లలో మళ్లీ గోల కోసం ఎదురుచూస్తున్నా. లవ్ యు, అంటూ ఫస్ట్ లుక్ ను షేర్ చేశాడు నవీన్ పోలిశెట్టి. హీరో హీరోయిన్ ఇద్దరి పేర్లలో శెట్టి కామన్ గా ఉంది. ఈ సినిమా టైటిల్ ను గమనిస్తే అనుష్క శెట్టి లోని శెట్టికి మిస్, నవీన్ పోలిశెట్టి లోని పోలిశెట్టి కి మిస్టర్ యాడ్ చేస్తూ టైటిల్ ఫిక్స్ చేశారు. అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుంటే, మరోవైపు నవీన్ పోలిశెట్టి గోడపై కూర్చోని హ్యాపీ మూడ్ లో కనిపిస్తున్నాడు.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్‌ చేసిన ఉమేష్ యాదవ్

మొత్తానికి సింగిల్స్ గా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు నవీన్ పోలిశెట్టి. టైటిల్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యారు మేకర్స్. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రాన్ని మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి 20 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా, 40 ఏళ్ల మహిళగా అనుష్క నటించనుంది.

READ ALSO : నందమూరి కుటుంబంలో ఇన్ని చీకటి కోణాలు ఉన్నాయా…?

Visitors Are Also Reading