Home » మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మృతి

మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త మృతి

by Anji
Ad

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ  భర్త బొడిగె గాలయ్య కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మరణించినట్లు బంధువులు, సన్నిహితులు, తెలిపారు. గాలయ్య అంత్యక్రియలు ఆదివారం సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఇక ఈ విషాద ఘటనపై స్పందించిన ఈటల రాజేందర్ .. ‘చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ గారి భర్త గాలన్న గారు కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. వారి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. గాలన్న మృతి తీరని లోటు, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ శోభ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Visitors Are Also Reading