Home » Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుస‌రించండి..!

Chanakya Niti : విజయం సాధించాలంటే చాణక్య చెప్పిన ఈ 4 మార్గాలు అనుస‌రించండి..!

by Anji
Ad

ఆచార్య చాణ‌క్యుడు గొప్ప ఆర్థిక‌వేత్త‌, మంచి వ్యూహ‌క‌ర్త‌. నిజ జీవితంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలో వివ‌రిస్తూ చాలా పుస్త‌కాల‌ను రచించారు. అత‌ను చెప్పిన నీతి వ్యాఖ్య‌ల కార‌ణంగా కౌటిల్యుడు అనే బిరుదు కూడా వ‌చ్చింది. చాణ‌క్యుడు ర‌చించిన నీతిశాస్త్రం చాణ‌క్య‌నీతి పేరుతో ప్ర‌సిద్ధి చెందింది. ఈ గ్రంథంలో అనేక అంశాల‌ను ఆచార్యుడు ప్ర‌స్తావించారు. ఆయ‌న అప్పుడు రాసిన చాణ‌క్య నీతి ఇప్ప‌టి ప్ర‌జ‌ల‌కు స‌రైన మార్గాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా జీవితంలో విజ‌యం సాధించాలంటే ఆచార్య చాణ‌క్య నాలుగు మార్గాల‌ను సూచించారు. అవి ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

chanakya-niti

chanakya-niti

  • విజ‌యం సాధించ‌డానికి అధ్మ‌ర్మ మార్గాన్ని ఎప్ప‌టికీ కూడా ఎంచుకోకూడ‌దు అని ఆచార్య చాణ‌క్య సూచించారు. అలాంటి విజ‌యం ఎంత త్వ‌ర‌గా వ‌స్తుందో అంతే త్వ‌ర‌గా వెళ్లిపోతుంద‌ని చెప్పారు. మతం మార్గం కొంచెం క‌ష్ట‌మైన‌దే కావ‌చ్చు. కానీ అది మీ కీర్తిని చాలా దూరం తీసుకెళ్లుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  సీనియ‌ర్ ఎన్టీఆర్ ఆ స్టార్ హీరోయిన్‌తో ప్రేమ‌లో ప‌డి రెండో పెళ్లి చేసుకోవాల‌నుకున్నారా..?

Advertisement

  • క్ర‌మ‌శిక్ష‌ణ కూడా జీవితంలో చాలా అవ‌స‌రం అనే చెప్పాలి. క్ర‌మ‌శిక్ష‌ణ లేని వ్య‌క్తులు జీవితంలో చాలా క‌ష్టాల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని చెప్పారు ఆచార్య‌. విజ‌యం సాధించాల‌నుకుంటే ప్ర‌తీ నిమిషాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఎవ‌రైతే స‌మయాన్ని వినియోగించుకుంటారో వారు జీవితంలో స‌క్సెస్ సాధిస్తారు. క్ర‌మ శిక్ష‌ణ లేకుంటే జీవితంలో విజ‌యం సాధించ‌డం అసాధ్యం అన్నారు.

Advertisement

  • సాధార‌ణంగా ఎవ‌రైనా ల‌క్ష్యాన్ని సాధించే దిశ‌లో చాలాసార్లు ఓట‌మిని ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కానీ దాని గురించి ఎప్పుడు భ‌య‌ప‌డ‌వ‌ద్ద‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు. ఓడిపోవ‌డం కూడా మీ అభ్యాస ప్ర‌క్రియ‌లో ఓ భాగ‌మ‌ని చెప్పారు. ముఖ్యంగా విజ‌యం సాధించ‌డం కోసం జీవితంలో ఓ స‌రైన ల‌క్ష్యాన్ని ఎంచుకోవాలి. ఆ ల‌క్ష్య సాధ‌న కోసం నిత్యం క‌ష్ట‌ప‌డాల‌ని తెలిపారు.

ఇది కూడా చ‌ద‌వండి :  మీరు బీరు తాగుతున్నారా..? ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వెంట‌నే మానేయండి..!

  • విజ‌యం సాధించాల‌నుకునే వ్య‌క్తికి సోమ‌రిత‌నం అస్స‌లు ప‌నికిరాదు. సోమ‌రిత‌నం ఉన్న వ్య‌క్తి ప‌నిని ప‌లుమార్లు వాయిదా వేస్తాడు. కానీ అది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని ఆచార్య చాణ‌క్య సూచించారు. మీరు జీవితంలో విజ‌యం సాధించాలంటే సోమ‌రిత‌నం విడ‌నాడాల‌ని చెప్పారు. సోమ‌రిత‌నం వ‌ల్ల ఒక వ్య‌క్తి ఎప్పుడు విజ‌యం సాధించ‌లేడ‌ని ఆచార్య తెలిపారు. ముఖ్యంగా విజ‌యానికి పెద్ద శ‌త్రువు సోమ‌రిత‌నం క‌లిగిన వ్య‌క్తి అని ఆచార్య చాణ‌క్య‌ భావించారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఆచార్య చాణ‌క్య సూత్రాల‌ను పాటించి విజ‌యం మీ సొంతం చేసుకోండి.

ఇది కూడా చ‌ద‌వండి :  పెళ్లికి ముందున్న ప్రేమ ఆ త‌ర‌వాత ఎందుకు ఉండ‌దు…5 కార‌ణాలు ఇవేనా..?

Visitors Are Also Reading