Home » మీరు బీరు తాగుతున్నారా..? ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వెంట‌నే మానేయండి..!

మీరు బీరు తాగుతున్నారా..? ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వెంట‌నే మానేయండి..!

by Anji
Ad

సాధార‌ణంగా ఇండ్ల‌లో ఏదైనా ఫంక్ష‌న్‌లు, పండుగ‌లు జ‌రిగిన‌ప్పుడు లేదా ఫ్రెండ్స్ క‌లిసిన‌ప్పుడు చాలా మంది మ‌ద్యం సేవిస్తుంటారు. ఇక మ‌ద్యం తాగేవారిలో ఎక్కువ మంది బీర్ తాగుతుంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మందికి ఎంతో ఇష్ట‌మైన మ‌ద్య‌పానియం బీరు. కూల్ డ్రింక్ తాగిన‌ట్టుగానే బీరు తాగ‌డం హాబీగా మారుతుంటుంది. ఎప్పుడు తాగాల‌నిపిస్తే అప్పుడు తాగేస్తుంటారు. బీరులో సాధార‌ణంగా 5 నుంచి 6 శాతం వ‌ర‌కు ఆల్క‌హాల్ ఉంటుంది. దీనిని తీసుకోవ‌డం ద్వారా ఆరోగ్యానికి కొన్ని ప్ర‌యోజ‌నాలున్నాయి. అదేవిధంగా బీరును ఎప్పుడో ఒక‌సారి తాగితే ప‌ర్లేదు కానీ ఎక్కువ‌గా తాగితే మాత్రం శరీరానికి తీవ్ర‌మైన హాని క‌లుగుతుంది. బీరు తాగ‌డం ద్వారా వ‌చ్చే కొన్ని స‌మ‌స్య‌ల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ఇక హెల్త్ లైన్ నివేదిక ప్ర‌కారం.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే మాత్రం వెంట‌నే బీరు తాగ‌డం మానేయాలి. లేదంటే ఇక అంతే సంగ‌తి. బీరు ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల ఆందోళ‌న‌తో పాటు డిప్రెష‌న్ మానిఫోల్డ్ రిస్క్ పెరుగుతుంది. ఆందోళ‌న , డిప్రెష‌న్ అనిపిస్తే వెంట‌నే బీరు తాగ‌డం మానేయాలి. కానీ ఎక్కువ‌గా ఆందోళ‌న ఉన్న‌ప్పుడే చాలా మంది బీరు తాగుతుంటారు. అదే ప‌నిగా తాగితే మాత్రం ఒత్తిడి త‌గ్గ‌క‌పోగా.. కొత్త ఇబ్బందులు త‌లెత్తుతాయి. జీర్ణ‌క్రియ స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నా.. కాలేయ ప‌నితీరు మంద‌గిస్తున్నా.. మ‌ద్య‌పానం మానేయాలి. ఆల్క‌హాలిక్ హెప‌టైటిస్ వంటి తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల‌ను ఆల్క‌హాల్ క‌లిగిస్తుంది. దీనిని నివారించాలంటే బీరుకు వీలైనంత దూరంగా ఉండ‌డం బెట‌ర్‌.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్మం కోసం అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, ఖ‌నిజాలు ఇవే..!


ముఖ్యంగా బీర్ ఎక్కువ‌గా తాగ‌డం వ‌ల్ల సిర్రోసిస్ కూడా వ‌చ్చే ముప్పు పెరుగుతుంద‌ని.. చాలా అధ్య‌య‌నాల్లో వెల్ల‌డి అయింది. మ‌ద్యానికి బానిస అవ్వ‌కండి. బీర్ తాగ‌డం వ‌ల్ల బ‌రువు వేగంగా పెరుగుతారు. అదేవిధంగా పొట్ట కూడా పెరుగుతుంది. గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఒక‌ బీరులో దాదాపు 153 కేల‌రీలుంటాయి. శ‌రీర బ‌రువు పెరిగి ఊబ‌కాయానికి దారి తీస్తుంది. ముఖ్యంగా బీరు తాగితే బ‌రువు పెరుగుతున్న‌ట్టు అనిపిస్తే మాత్రం దూరంగా ఉండ‌డ‌మే బెట‌ర్‌. ప్ర‌ధానంగా బీపీ పేషెంట్లు ఎలాంటి ఆల్క‌హాల్ డ్రింక్ తీసుకోకూడ‌దు. వారు డ్రింక్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గొంతు, నోటి క్యాన్స‌ర్ స‌హా ప‌లు ర‌కాల క్యాన్సర్‌ వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు కూడా బీరు తాగ‌కూడ‌దు. ఏ స‌మ‌స్య లేని వారు తాగితే ప‌ర్వాలేదు.. కానీ ఇలాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు బీరుజోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే చాలా మంచిది.

ఇది కూడా చ‌ద‌వండి :  భోజ‌నం చేసిన త‌రువాత ఎట్టి ప‌రిస్థితిలో కూడా ఈ ప‌నులు అస్స‌లు చేయ‌కండి..!

Visitors Are Also Reading