Home » అంబేద్క‌ర్ జ‌యంతి ఆఫ‌ర్..అక్క‌డ రూపాయికే లీట‌ర్ పెట్రోల్…!

అంబేద్క‌ర్ జ‌యంతి ఆఫ‌ర్..అక్క‌డ రూపాయికే లీట‌ర్ పెట్రోల్…!

by AJAY
Ad

అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా రాజ‌కీయ నాయ‌కులు, అంబేద్క‌ర్ ను అభిమానించేవారు సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారన్న సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశానికి రాజ్యాంగాన్ని ర‌చించిన మేధావిని గుర్తు చేసుకుంటూ నేడు దేశ‌మంత‌టా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉంటారు. అయితే ఒక‌ద‌గ్గ‌ర మాత్రం అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా వంద‌కు పైగా లీట‌ర్ ఉన్న పెట్రోల్ ను కేవ‌లం ఒక్క రూపాయికే అందించారు. వివ‌రాల్లోకి వెళితే…మ‌హ‌రాష్ట్ర‌లోని షోలాపూర్ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది.

Advertisement

Advertisement

షోలాపూర్ లోని ఓ పెట్రోల్ బంక్ య‌జ‌మాని ఈ ఆఫ‌ర్ ను ప్ర‌క‌టించాడు. దాంతో వాహ‌న‌దారులు భారీగా వ‌చ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు. ఈ నేప‌థ్యంలో అక్క‌డ నెల‌కొన్న గంద‌ర‌గోలానికి పోలీసులు వ‌చ్చి వాహ‌నదారుల‌ను అదుపుచేసే ప‌రిస్థితి నెల‌కొంది. ఇక మొత్తం 500 మందికి లీటర్ పెట్రోల్ ను రూపాయికి అందించారు. నిజానికి ప్ర‌స్తుతం పెట్రోల్ ధ‌ర లీట‌ర్ కు వంద‌కు పైగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో త‌మ‌కు కేవ‌లం రూపాయికే లీట‌ర్ పెట్రోల్ ఇవ్వ‌డంతో వాహ‌న‌దారులు పెట్రోల్ బంక్ య‌జ‌మానితో పాటూ అంబేద్కర్ ను త‌లుచుకుని కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకున్నారు.

Visitors Are Also Reading