Home » SUNNY LEONE : స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

SUNNY LEONE : స‌న్నిలియోన్ ఫ్యాన్స్ కు బంప‌రాఫ‌ర్..అక్క‌డ చికెన్ పై డిస్కౌంట్…!

by AJAY
Ad

అభిమానులు త‌మ ఫేవ‌రెట్ న‌టీన‌టుల పుట్టిన రోజులకు లేదంటే తమ అభిమాన నటీనటుల సినిమాలు విడుదలైనప్పుడు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారన్న‌ సంగతి తెలిసిందే. కానీ కొంత మంది అభిమానులు అంతకుమించి చేస్తుంటారు. తాజాగా ఓ నటి అభిమాని అదే చేస్తున్నాడు. ఓ ప్ర‌ముఖ న‌టికి వీరాభిమాని అయిన చికెన్ సెంటర్ యజమాని ఏడాది పాటు ఉచితంగా చికెన్ పై డిస్కౌంట్ ఇస్తానంటూ బోర్డు పెట్టాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైర‌ల్ అవుతోంది.

sunny leone

Advertisement

ఇంతకీ ఎవరా అభిమాని…? ఎవరికి వీరాభిమాని అనే సంగతి తెలుసుకుందాం. కర్ణాటకకు చెందిన ప్రసాద్ అనే యువకుడు ఒక‌ప్ప‌టి శృంగార తార, ప్రస్తుత బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు వీరాభిమాని. కాగా ప్రస్తుతం ప్రసాద్ చికెన్ సెంటర్ ను నిర్వహిస్తున్నారు. ఈ చికెన్ సెంటర్ కర్ణాటక రాష్ట్రంలోని మాంద్య నురది రోడ్డులో ఉంది. అయితే ప్రసాద్ స‌న్నీ లియోన్ పై త‌న అభిమానాన్ని చాటుకునేందుకు తన చికెన్ సెంటర్ వద్ద సన్నీలియోన్ అభిమానులకు ప్రత్యేక డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

Advertisement

కేజీ చికెన్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు తన షాపు వద్ద బోర్డుపై పేర్కొన్నాడు. ఇక ఈ చికెన్ సెంటర్ ప్ర‌స్తుతం స‌న్నిలియోన్ అభిమానులు క్యూ క‌డుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న సన్నిలియోన్ అభిమానులు తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఆఫర్లు ఉంటే బాగుండు అని అనుకుంటున్నాను.

ఇదిలా ఉండ‌గా ఒక‌ప్పుడు శృంగార తార‌గా స‌న్నిలియోన్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. బాలీవుడ్ లో అడపాదడ‌పా ఆఫ‌ర్ లు రావ‌డంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక వ‌రుస ఆఫ‌ర్లు రావ‌డంతో పూర్తిగా న‌టిగా మారిపోయింది. శృంగార వీడియోల‌కు పులిస్టాప్ పెట్టింది. కేవ‌లం బాలీవుడ్ లోనే కాకుండా ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టిస్తోంది.

ALSO READ : 

NIHARIKA KONIDELA : నిహారిక‌కు ఆంక్ష‌లు…ప‌బ్ ఇష్యూతో మెగాడాట‌ర్ స్వేచ్చను కోల్పోయిందా..?

నాగచైతన్య వదులుకున్న 5 సూపర్ హిట్ సినిమాలు ఇవే..!

 

Visitors Are Also Reading