Home » నిద్ర ఎక్కువ‌గా పోతే అందంగా అవుతారా..? ఇది వాస్త‌వ‌మో కాదో తెలుసుకోండి..!

నిద్ర ఎక్కువ‌గా పోతే అందంగా అవుతారా..? ఇది వాస్త‌వ‌మో కాదో తెలుసుకోండి..!

by Anji
Ad

ఆరోగ్యానికి నిద్ర చాలా అవ‌స‌రం. చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు, సౌంద‌ర్యానికి సంబంధించిన అంశాల్లో నిద్ర‌ను ప్ర‌ధానంగా భావించ‌రు. ఎలా క‌నిపిస్తున్నార‌నే అంశంపై నిద్ర గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావం చూపుతుంది. నిద్ర అందం పై కూడా ప్ర‌భావం చూపిస్తుంది. ఇక్కడే బ్యూటీ స్లీప్ అనేది తెర‌పైకి వ‌స్తోంది. ఒక వ్య‌క్తి య‌వ్వ‌నంగా, అందంగా క‌నిపించ‌డానికి వారికి అవ‌స‌ర‌మైన నిద్ర‌ను బ్యూటీ స్లీప్ గా పిలుస్తారు. బ్యూటీ స్లీప్ అనే ప‌ద‌బంధాన్ని చాలా మంది ఇంత‌కు ముందు వినిక‌పోవచ్చు. ఆరోగ్యంతో పాటు అందం కూడా బ్యూటీ స్లీప్‌తో ముడిప‌డి ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.


చ‌ర్మ పున‌రుత్ప‌త్తికి నిద్ర చాలా ముఖ్యం. నిద్రిస్తున్న‌ప్పుడు శ‌రీరం రిక‌వ‌రీ మోడ్‌లోకి వెళ్తుంది. కారిస్టాల్‌, మెల‌టోనిన్‌, హ్యుమ‌న్ గ్రోత్ హార్మోన్ స‌హా నిద్ర వివిధ ద‌శ‌ల్లో అనేక హార్మ‌న్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఈ హార్మోన్లు చ‌ర్మానికి చాలా అవ‌స‌రం. ఎందుకంటే అవి రోజు వారి చ‌ర్మ న‌ష్టాన్ని స‌రిచేస్తాయి. క‌ణాల‌కు హాని క‌లిగించే రాడిక‌ల్స్ నుంచి య‌వ్వ‌న చ‌ర్మాన్ని కాపాడుతాయి. నిద్ర లేక‌పోవ‌డం వ‌ల్ల బ‌య‌టికి క‌నిపించ‌డం కంటే ఇంకా ఎక్కువ ప్ర‌భావం ఉంటుంది. త‌గినంత నిద్ర లేక‌పోతే శ‌రీరం, మ‌న‌స్సు, స‌క్ర‌మంగా ప‌ని చేయ‌వు. నీర‌సంగా అలిసిపోయిన‌ట్టు అనిపించ‌వ‌చ్చు.

Advertisement

Advertisement

ఇక రోజు అంతా గ‌డ‌ప‌డానికి త‌క్కువ శ‌క్తి ఉంటుంది. ఎలివేటేడ్ కార్టిసాల్ స్థాయిల కార‌ణంగా ఇత‌ర అధ్య‌య‌నాలు నిద్ర‌లేమి గుండె జ‌బ్బులు, మ‌ధుమేహం, కొలెస్ట్రాల్, వంటి ప్రమాదాన్ని పెంచుతాయ‌ని చెబుతున్నాయి. నిద్ర‌లేమితో జ్ఞాప‌క శ‌క్తి కోల్పోవ‌డం, భావోద్వేగ అస్థిర‌త పేవ‌ల‌మైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వంటివి ఎదుర‌వుతాయి. నిద్ర లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌నిలో సామ‌ర్థ్యం దెబ్బ‌తింటుంది. మాన‌సిక స్థితి మార్పుల‌కు కార‌ణం అవుతుంది. నిరాశ కోపం వంటి ప్ర‌తికూల భావాల‌ను పెంచుతుంది.

  • ఉద‌యం వేళ‌లో కాఫీ తాగే అల‌వాటు చాలా మందికి ఉంటుంది. సాయంత్రం, రాత్రి కెఫిన్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి.
  • ప‌డుకునే ముందు మ‌ద్యం తాగొద్దు. ఆల్క‌హాల్ నిద్ర‌ను నాశ‌నం చేస్తుంది. ఇది ప‌గ‌టిపూట అల‌సిపోయే విధంగా, నిద్ర‌పోయేలా చేస్తుంది.
  • రాత్రికి ముందు ఏదైనా తీవ్ర‌మైనా వ్యాయామం చేయ‌డం మానుకోండి.
  • ప‌డుకోవ‌డానికి గంట ముందు గాడ్జెట్‌ల‌ను దూరంగా ఉంచండి.
  • రోజూ ఒకే స‌మ‌యానికి నిద్ర పోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకోండి.
  • ప్ర‌తి రోజు ఉద‌యం దాదాపు ఒకే స‌మ‌యానికి నిద్ర లేవండి.
  • ప‌గ‌టిపూట న్యాప్స్ ను 30 నిమిషాల‌కు మించ‌కుండా ఉంచండి.
  • వీకెండ్స్‌లో రెగ్యుల‌ర్ స్లీపింగ్ రొటిన్ ఫాలో అవ్వండి.

Also Read : 

బాల‌య్య రెండో కుమార్తె తేజ‌స్విని ఎక్కడ ఉంటారు…? ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారో తెలుసా..?

చిరంజీవి అయినా ఎవ‌డైనా స‌రే మా నాన్న త‌రువాతే.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

 

Visitors Are Also Reading