Home » చిరంజీవి అయినా ఎవ‌డైనా స‌రే మా నాన్న త‌రువాతే.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

చిరంజీవి అయినా ఎవ‌డైనా స‌రే మా నాన్న త‌రువాతే.. మంచు విష్ణు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

by Anji
Ad

మంచు మోహ‌న్ బాబు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన మంచు విష్ణు హీరోగా కొన్ని సినిమాలు సక్సెస్ అయినప్పటికీ హీరోగా మాత్రం అంతగా రాణించలేదు. ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ తీసుకుని విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి జరిగిన ఎలక్షన్ లో పాల్గొని అధ్యక్షుడు అయ్యాడు. హాయ్ ఎలక్షన్లో ఎప్పుడు జరిగినట్టుగా కాకుండా ఈసారి జనరల్ ఎలక్షన్ లో జరిగిన అంత ఉత్కంఠ భరితంగా జరిగాయి. వైపు ప్రకాశాలు మరోవైపు విష్ణు పోటాపోటీ అన్నట్టుగా జరిగినయి ఎన్నికల్లో విష్ణు మా అధ్యక్షుడిగా గెలిచాడు. ఈ ఎన్నికల సందర్భంగా ఇంటర్వ్యూలో మంచు విష్ణు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రకాష్రాజ్ తరఫున మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మద్దతు ఇచ్చింది. ఈ విషయంలో మోహన్ బాబు మాట్లాడుతూ అక్కడ ప్రకాష్ రాజు కాకుండా చిరంజీవి ఇంట్లో ఇంకెవరైనా నిలబడి ఉంటే ఎలక్షన్లో నేను ఏకగ్రీవానికి ఒప్పుకునే వాడినని చెప్పారు. వీటి గురించి మాట్లాడుతూ.. నేను అసలు మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలనే ఆలోచన కూడా లేదు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు వచ్చి అడిగారు. నాన్న నీ సంప్రదిస్తే ఎందుకు ఇప్పుడు అని అన్నారు. అతని ఇష్టం పోటీ చేయాలనుకుంటే చేయి అని చెప్పారు.

Advertisement

Advertisement


నాన్న ఎప్పుడైతే అలా చెప్పాడో అప్పుడే నేను ఎన్నికల్లో పోటీచేయాలని అనుకున్నాను. లేకుంటే మా ఎన్నికల్లో బరిలోకి దిగే వాడిని కాదు. కానీ చిరంజీవి ఆయన వెనుక ఉన్న ఆ దేవుడు ఆయన యొక్క ఉన్నా నేను తగ్గను. నాకు అందరికంటే ముందు మా నాన్న ఆయన మాట కచ్చితంగా పాటిస్తానని విష్ణు చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లోకి వెళ్లాలనే ఆలోచనతో మంచు విష్ణు మా ఎన్నికల్లో పోటీ చేశాడనే కామెంట్లు కూడా వినిపించాయి. వీటిపై స్పందిస్తూ నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంటే నేను ఎప్పుడో వెళ్లేవాడిని.. దాన రాజ్యసభ మాజీ మెంబర్.. ప్రస్తుతం ఏపీ సీఎం మా బావ.. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బ్యాగ్రౌండ్ పెట్టుకొని నేను మా ఎన్నికలను నా రాజకీయ ఆరంగెట్రానికి వాడుకుంటానని అనుకోవడం వారి మూర్ఖత్వమే అని చెప్పారు. ఆ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read : 

బింబిసార 2 సినిమా క‌థ ఇదే.. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట రాజ‌మౌళిని ఫాలో అయ్యారా..?

ఐర‌న్ లెగ్ అనుకుంటే గోల్డెన్ లెగ్ అయ్యింది…! శృతిహాస‌న్ బ్రేక్ ఇచ్చిన 7 గురు స్టార్స్ వీళ్లే…!

 

Visitors Are Also Reading