Home » పెళ్లి కాకుండానే 48 మంది పిల్ల‌ల‌కు తండ్రి.. అతని ప్రొఫేష‌న్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

పెళ్లి కాకుండానే 48 మంది పిల్ల‌ల‌కు తండ్రి.. అతని ప్రొఫేష‌న్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

సాధార‌ణంగా పెళ్లి జ‌రిగిన వారు పిల్ల‌లు కావాలని ప‌రిత‌పిస్తుంటారు. కొంత‌మందికి పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో ఆసుప‌త్రుల చుట్టు, గుళ్లు, గోపురాల చుట్టూ ఇలా ఎవ‌రికీ న‌చ్చిన వ‌ద్ద‌కు వారు వెళ్తుంటారు. మ‌రికొంద‌రైతే డాక్టర్లు చెప్పిన ఏ ర‌క‌మైన ట్రీట్‌మెంట్ అయినా స‌రే చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మ‌రికొంద‌రిలో స్పెర్మ్ కౌంట్ త‌క్కువ‌గా ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రూ స్వ‌చ్చందంగా స్పెర్మ్ కౌంట్ చేస్తుంటారు. ఈ కోవ‌కు చెందిన ఘ‌టన వార్త‌ల్లో నిలిచింది.

Advertisement

అమెరికాకు చెందిన కైల్ గోర్డి చేసిన ప‌ని ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిలిచింది. లాస్ ఏంజెల్స్ న‌గ‌రానికి చెందిన కౌల్ గోర్డి పిల్ల‌లు పుట్ట‌ని దంప‌తుల‌కు స్పెర్మ్ దానం ఇచ్చేవాడు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని శుక్ర‌క‌ణాలు స్వీక‌రించి దాదాపు 48 మంది పిల్ల‌లు పుట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇత‌నికి మాత్రం పెళ్లి కాలేదు. క‌నీసం ఒక గ‌ర్ల్‌ఫ్రెండ్ కూడా లేదు. ఇత‌ను ఎవ్వ‌రితోనైనా డేటింగ్ చేయ‌గానే త‌న స్పెర్మ్ డొనేటింగ్ గురించి చెప్పేవాడు. వారు కైల్ చేసిన ప‌నికి ముక్కున వేలు వేసుకునేవారు. ఇత‌నితో సంబంధం కొన‌సాగించ‌డానికి ఆస‌క్తి చూపించే వారు కాదు. దీనిపై కైల్ స్పందిస్తూ.. త‌న‌కు త‌న‌కు ఇంకా మ‌రికొంద‌రి జంట‌ల‌కు స్పెర్మ్ దానం ఇచ్చి పిల్ల‌ల‌ను పుట్టించాల‌నే కోరిక ఉంద‌ని చెప్పాడు.

Advertisement


ముఖ్యంగా కైల్ గోర్డి త‌న స్పెర్మ్ ను పిల్ల‌ల కోసం ఆరాట‌ప‌డే వారికి దానం చేసేవాడు. స్పెర్మ్ కౌంట్ త‌క్కువ ఉన్న కార‌ణంగా గ‌ర్భం దాల్చ‌లేక‌పోయిన వారు ఇత‌న్ని సంప్ర‌దిస్తుంటారు. త‌న స్పెర్మ్‌ను అవ‌స‌ర‌మైన మ‌హిళ‌ల‌కు నేరుగా ఇచ్చేవాడు. స్పెర్మ్ బ్యాంకుల‌ను ఉప‌యోగించ‌డానికి కొంత‌మంది ఇష్ట‌ప‌డ‌ర‌ని.. ఎందుకంటే అక్క‌డ దాత‌లు ఎవ‌రో తెలియ‌దు. దాదాపు 8 సంవ‌త్స‌రాల కాలంలో కైల్ కార‌ణంగా 4 డ‌జ‌న్ల మంది మ‌హిళ‌లు త‌ల్లులు అయ్యారు. నేను మ‌హిళ‌లకు సాయం చేస్తున్నాను. కానీ వారు ఇత‌ర మ‌హిళ‌ల‌తో పిల్ల‌ల‌ను క‌లిగి ఉన్న వ్య‌క్తితో ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. ఓ లెస్బియ‌న్ జంట అభ్య‌ర్థ‌న మేర‌కు తాను 8 సంవ‌త్సరాల కింద‌ట స్పెర్మ్ డొనేష‌న్ ప్రారంభించానని చెప్పుకొచ్చాడు కైల్‌. ఆన్‌లైన్ లో అభ్య‌ర్థ‌న మేర‌కు ప్ర‌తిస్పందిస్తూ వేర్వేరు మ‌హిళ‌ల‌కు స్పెర్మ్ దానం చేయ‌డం మొద‌లుపెట్టాడు. అలా 48 మందికి స్పెర్మ్ దానం చేశాడు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Also Read : 

మ‌న‌దేశంలో పిన్‌కోడ్ ఎలా పుట్టిందో మీకు తెలుసా..?

ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్..!

Visitors Are Also Reading