Home » ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్..!

ఎన్టీఆర్ అభిమానుల‌కు శుభ‌వార్త‌.. క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒక‌రైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న తొలి సినిమా నిన్ను చూడాల‌ని సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైన‌ప్ప‌టికీ అది ఆశించిన స్థాయిలో రాణించ‌లేదు. ఇక ఆ త‌రువాత ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి డైరెక్ట‌ర్ గా పరిచ‌య‌మై స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ సినిమాతో ఎన్టీఆర్ పేరు మారు మోగిపోయింది. ఇక వెను వెంట‌నే వివివినాయ‌క్ తో ఆది, రాజ‌మౌళి సింహాద్రి సినిమాల‌తో ఎన్టీఆర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్‌ని, అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

Advertisement

ఇక అప్ప‌టి నుంచి జ‌య‌, అప‌జ‌యాల‌తో ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు సినిమాల‌తో బిజీగానే గ‌డుపుతున్నాడు ఎన్టీఆర్. ముఖ్యంగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవ‌ల్ లో క్రేజ్ సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాతో నార్త్ ఇండియా ఆడియ‌న్స్ కి ఫెవ‌రేట్ హీరో అయ్యారు. కొమురం భీమ్ పాత్ర‌లో భార‌తీయ సినీ అభిమానుల‌నే కాదు.. ప్ర‌పంచ వ్యాప్తంగా న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ కి ఆస్కార్ అవార్డు వ‌స్తుంద‌ని ఓ మ్యాగ‌జైన్‌లో కూడా ప్ర‌క‌టించ‌డం విశేషం. త్వ‌ర‌లోనే త‌న త‌దుప‌రి చిత్రం షూటింగ్ లో భాగం కానున్నారు. ఇక మాస్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా రానున్న‌ది.

Advertisement

ప్ర‌స్తుతం కొర‌టాల సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకొంటుంది. ఈ సినిమానే కాకుండా కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు ఎన్టీఆర్. ఇప్ప‌టికే వీరిద్ద‌రికీ సంబందించిన ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. తాజాగా NTR 31వ చిత్రం గురించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఓ ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశాడు. తాజాగా మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాడు. తార‌క్ సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ తో తాను చేయ‌బోయే సినిమా షూటింగ్ ఏప్రిల్, మే నెల‌లో ప్రారంభం కానుంద‌ని వెల్ల‌డించాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌తో స‌లార్ సినిమా చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది సెప్టెంబ‌ర్ 28న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

Also Read : 

ఆ డైరెక్టర్ తో ప్రేమలో పడి 11ఏండ్లు వెయిట్ చేసిన రోజా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

నాగార్జున చెప్పడంతోనే త‌న‌ని ఆ సినిమా నుంచి తొల‌గించారంటున్న హీరో వేణు తొట్టెంపూడి..!

Visitors Are Also Reading