ప్రతి ఒక్క తండ్రి తన కూతురిని ఒక దేవతలా చూసుకుంటాడు. మన ప్రపంచంలో విడదీయరాని బంధం ఏదైనా ఉంది అంటే అది తండ్రికూతుళ్ల అనుబంధమే. కూతురి కోరికలను తీర్చడానికి కోసం తండ్రి తపన పడితే, తన తండ్రి కల నెరవేర్చేందుకు కూతురు కూడా తపన పడుతుంది. తండ్రీ కూతుర్ల ప్రేమను వారు మాత్రమే అర్థం చేసుకోగలరు. కానీ మరొకరికి అర్థం కాదు. మరి ప్రతి తండ్రి తన కూతురికి ఈ 3విషయాలు మాత్రం తప్పనిసరిగా తెలిసేలా చెప్పాలి..అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆశయాలు వదులుకోవద్దు :
ఏ కుటుంబంలో అయినా తండ్రికి తన కొడుకు కోరిక కంటే కూతురు కోరిక తీర్చాలనే తపన ఉంటుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన తగ్గకుండా, ఆశయాలను నెరవేర్చే మీ గమ్యం వైపు ప్రయాణించండి అనే పదాలను తన కూతుళ్లకు వినిపించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.
Advertisement
also read:సినిమా నిర్మాణం కోసం లారీ అమ్ముకున్నాడు..కట్ చేస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్..!!
Advertisement
ఎక్కడా తగ్గవద్దు :
పూర్వకాలం నుంచి సమాజంలో మగవాళ్లే ఎక్కువ అనే భావన ఉంది. కానీ ప్రస్తుత సమాజంలో మగ ఆడ అని తేడా లేకుండా ఇద్దరు సమానమైన హోదా లో ఉంటున్నారు. అయినా కొన్ని అసమానతలు మాత్రం తగ్గలేదు.కానీ ఏ తండ్రి అయినా తన కూతురికి ఎక్కడా కూడా లొంగి పోకూడదని నేర్పించాలి .
వయస్సు పరిగణ :
సాధారణంగా ఈ ప్రమాదంలో అమ్మాయికి ఒక నిర్దిష్ట వయసు వచ్చిందంటే పెళ్లి గురించి ఆలోచిస్తారు. కానీ కొంతమంది తండ్రులు మాత్రం ముందు నీ లక్ష్యాన్ని సాధించు, దాని తర్వాత ఈ విషయాలు ఆలోచిద్దామని తన కూతురికి లక్ష్యం నిర్దేశించిన తండ్రులు ఎంతో మంది ఉన్నారు.
also read: