Home » “ఫిదా” సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌మ్ముడు ఎవ‌రో తెలుసా…? సినిమా ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..?

“ఫిదా” సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌మ్ముడు ఎవ‌రో తెలుసా…? సినిమా ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లోని క్రేజీ డైరెక్ట‌ర్ ల‌లో శేఖ‌ర్ క‌మ్ముల కూడా ఒకరు. శేఖ‌ర్ క‌మ్ముల ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌చ్చారు. ఆయ‌న సినిమాల‌కు ప్ర‌త్యేక‌మైన ఫ్యాన్ బేస్ ఉంది. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలు ఫీల్ గుడ్ సినిమాలు అని చాలా మంది ఇష్ట‌ప‌డ‌తారు. ఆయ‌న తీసిన హ్యాపిడేస్, లీడ‌ర్, ఆనంద్ , ఫిదా సినిమాలు సూప‌ర్ హిట్ గా నిలిచాయి. శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో ప్ర‌తిపాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంది.

Advertisement

ఇక ఆయ‌న ద‌ర్శ‌కత్వంలో వ‌చ్చిన ఫిదా సినిమా ప్రేక్ష‌కుల‌కు చాలా ఇష్టం. ఈ సినిమాలో మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టించ‌గా సాయిప‌ల్ల‌వి హీరోయిన్ గా న‌టించింది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చాలా పాత్ర‌లు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతాయి.

Advertisement

ఇక ఈ సినిమాలో వ‌రుణ్ తేజ్ త‌మ్ముడిగా చిన్నారి బుజ్జి పాత్ర‌లో ఓ బుడ్డోడు న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ బుడ్డోడు త‌న డైలాగులు న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. కాగా ఆ బుడ్డోడి అస‌లు పేరు ఆర్య‌న్. బుడ్డోడు పుట్టింది పెరిగింది అమెరికాలోనే కాగా అనుకోకుండా ఫిదా సినిమాలో ఆఫ‌ర్ ను ద‌క్కించుకున్నాడు. ఫిదా సినిమాలో న‌టించ‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల కుర్రాడి కోసం అమెరికాలో తెలుగు వారిని ఆడిష‌న్స్ కు పిలిపించాడు.

కాగా ఆడిష‌న్స్ కు వ‌చ్చిన ఆర్య‌న్ కు సినిమాలో న‌టించే ఛాన్స్ ద‌క్కింది. ఆర్య‌న్ త‌న స్కూలింగ్ ను అమెరికాలోనే పూర్తి చేస్తున్నాడు. ఫిదా సినిమా 2017లో రాగా ఆర్య‌న్ ప్ర‌స్తుతం చూడ్డానికి పెద్దవాడు అయిపోయాడు. అంతే కాకుండా ఆర్య‌న్ కు సినిమాలు అంటే చాలా ఇష్ట‌మ‌ట‌. కాబ‌ట్టి న‌ట‌న పైనే శిక్ష‌ణ తీసుకుని ఫ్యూచ‌ర్ లో హీరో అవ్వాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. మ‌రి ఆర్య‌న్ క‌ల నెర‌వేరుతుందో లేదో చూడాలి.

Visitors Are Also Reading