Home » సినిమా నిర్మాణం కోసం లారీ అమ్ముకున్నాడు..కట్ చేస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్..!!

సినిమా నిర్మాణం కోసం లారీ అమ్ముకున్నాడు..కట్ చేస్తే తమిళ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కొన్ని సినిమా నిర్మాణాలు మహా అద్భుతం గా ఉంటాయి. ఆ చిత్రాన్ని నిర్మించడం కోసం నిర్మాతలు పడిన పాట్లు కూడా మనల్ని మెస్మరైజ్ చేస్తాయి. మరి అలాంటి ఓ సినిమా గురించి ఇప్పుడు చూద్దాం. శ్రీదేవి చంద్రమోహన్ జంటగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1978 లో వచ్చిన మూవీ పదహారేళ్ళ వయసు ఎంతటి ఘనవిజయం అందుకుందో మనందరికీ తెలుసు. చిన్న సినిమాగా పాతిక కేంద్రాల్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా 12 సెంటర్లలో 100 రోజులు, నాలుగు చోట్ల సిల్వర్ జూబ్లీ ఆడింది. అయితే ఈ మూవీ రీమేక్ గా వచ్చింది..దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

 

also read:SARDAR MOVIE TWITTER REVIEW : మ‌రో హిట్ కొట్టేసిన కార్తీ

భారతీరాజా’ “పదినారు వయడ్నిలే” తో ఒక స్క్రిప్టు రాసుకుని లోన్ కోసం ఫిలిం ఫైనాన్స్ కార్పొరేషన్ కి అప్లికేషన్ పెట్టుకున్నాడు. కానీ సానుకూల స్పందన రాకపోవడంతో, ఎలాగైనా సినిమా తీయాలని తిరుగుతున్న సమయంలో పరిచయమయ్యాడు లారీ ఓనర్ రాజు కన్ను. అతనికి సినిమాలంటే విపరీతమైన పిచ్చి. బడ్జెట్ ఎంత అని అడిగాడు. భారతీరాజా పూర్తిగా లెక్కలు వేసి నాలుగున్నర లక్షలు అని చెప్పాడు. దీంతో ఓకే చెప్పి కమల్ హాసన్, రజినీకాంత్, శ్రీదేవి కాంబినేషన్ లో, ఇళయరాజా సంగీతం అందించగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. షూటింగ్ పూర్తి సమయానికి వచ్చేసరికి ఆరు లక్షల ఖర్చు అయింది. ఇక మిగిలింది సమాకూర్చడం కోసం రాజు కన్ను తనకు ఉన్నటువంటి లారీని అమ్మేశాడు. చివరికి షూటింగ్ పూర్తి చేసి కేవలం ఆరు ప్రింట్లతో సినిమా రిలీజ్ చేశారు. సినిమా మొదటి రెండు మూడు వారాలు కనీసం టాక్ కూడా రాలేదు. ఇక ఆ తర్వాత అనూహ్యంగా టాక్ పెరిగిపోయింది.

Advertisement

10,20 కాదు ఏకంగా వంద ప్రింట్ లకు పైగా వేసినా కానీ ఇంకా కావాలని డిస్ట్రిబ్యూటర్ ల నుంచి ఫోన్లు వచ్చాయట. కలెక్షన్ల వర్షం కురుస్తోంది. 50 రోజులు కూడా పూర్తికాకుండానే వరదల్లా వస్తున్న వసూళ్లు చూసి ఇన్కం టాస్క్ వాళ్ళు ఎక్కడ రైడ్ చేస్తారో అని భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం నిర్మాత మిద్దె రామారావు రాజు కన్ను ఎక్కడో చెన్నైలో మారుమూల లాడ్జి లో ఉన్నాడని తెలుసుకొని రీమేక్ రైట్స్ కోసం లక్షా 50 వేల రూపాయలు ఆఫర్ చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా అదే స్థాయి విజయం సాధించింది. సిరిమల్లె పువ్వా అనే పాట అప్పట్లో మారుమోగిపోయింది అని చెప్పవచ్చు. ఇక లారీని అమ్ముకున్న రాజు కన్ను తమిళనాడులోనే స్టార్ ప్రొడ్యూసర్ గా మారాడు.

also read:

Visitors Are Also Reading