Home » 29 ఏళ్ల యువతితో,83 ఏళ్ల ఏజ్ లో తండ్రి కాబోతున్న ఫాసినో..!

29 ఏళ్ల యువతితో,83 ఏళ్ల ఏజ్ లో తండ్రి కాబోతున్న ఫాసినో..!

by Sravanthi
Ad

హాలీవుడ్ స్టార్ నటుడు ఆల్ ఫాసినో గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వార్తలు కనిపిస్తున్నాయి.. ఆయన 83 సంవత్సరాల వయసులో తండ్రి కాబోతున్నాడు. 29 ఏళ్ల సినీ నిర్మాత అయిన నూర్ అల్ఫాలాతో డేటింగ్ చేసిన ఆయన నెల రోజుల్లో తండ్రి కాబోతున్నాడని అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. పూర్తి వివరాలు చూసేద్దామా.. అయితే ఫాసినోకు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ నాలుగవ సంతానం. ఆయన గతంలో యాక్టింగ్ కోచ్ జాన్ టార్రాంట్ తో రిలేషన్ లో ఉన్నారు.

Advertisement

ఇప్పటికే తనకు 33 సంవత్సరాల కూతురు కూడా ఉన్నది. అంతేకాకుండా తన మాజీ గర్ల్ ఫ్రెండ్ బేవెర్లీ డి అజల్లోతో కూడా ఇద్దరు కవల పిల్లలను కన్నారు. తాజాగా నిర్మాత అయిన నూర్ తో డేటింగ్ చేసి నాలుగవ బిడ్డకు తండ్రి కాబోతున్నారు. అయితే ఫాసినో గాడ్ ఫాదర్ మూవీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఆయన 29 సంవత్సరాల నూర్ తో 2022 నుంచి సహజీవనం చేశానని తెలియజేశారు.

Advertisement

వీరిద్దరూ కలిసి పబ్బులు, హోటల్లు పలు రకాల టూరిస్ట్ ప్లేసులు తిరుగుతూ ఉన్న సమయంలో చాలా వరకు మీడియాలో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని కథనాలు వచ్చాయి. ఈ తరుణంలో ఆయన తండ్రి కాబోతున్నారని వార్త బయటకు రావడంతో ఆ కథనాలకు బలం చేకూరింది. కానీ అంతకుముందు ఎప్పుడు కూడా వీరి రిలేషన్ గురించి బయట పెట్టలేదు. కానీ ఒక్కసారిగా బిడ్డకు జన్మనివ్వబోతున్నానని ప్రకటన రావడంతో ట్రోలర్స్ పలు రకాలుగా ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరి కొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading