Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

Vijayashanthi : చిరంజీవితో 20 ఏళ్లుగా విజయశాంతి ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ?

by Bunty
Ads

అలనాటి నటి విజయశాంతి గురించి తెలియని వారు ఉండరు. హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి విజయశాంతి.

Advertisement

chiranjeevi-and-vijayashanthi-sushasini-movie

Ad

తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవికి… తనకు మధ్య ఉన్న ఇష్యూస్ గురించి, సినీ ఇండస్ట్రీ గురించి, ప్రస్తుతం మారుతున్న ట్రెండ్ గురించి ఆమె వివరణ ఇచ్చారు.

 

ఒకప్పుడు సినిమాలు 100 రోజులు, 200 రోజులు, 365 రోజులు ఆడేవి. ఆ సినిమాలకు సంబంధించిన బహుమతులు చాలామంది సెలబ్రిటీలు అందుకునేవారు. కానీ ఇప్పుడు ఒక సినిమా వారం పది రోజులు ఆడితే చాలు అని అందరూ అనుకుంటున్నారు. అప్పటికి ఇప్పటికీ అభిమానులు అలానే ఉన్నారు. అప్పట్లో వంద రోజులు ఫంక్షన్ ని గ్రాండ్ గా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మాత్రం సినిమా రిలీజ్ కి ముందు ఈవెంట్ ను ఘనంగా చేస్తున్నారు. అదేదో చాలా కొత్తగా ఉంది. ఇప్పటి జనరేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది అని ఆమె అన్నారు.

Advertisement

 

సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి అలా మాట్లాడతారు అని మీరు ఊహించారా… అని అడిగితే దానికి విజయశాంతి స్పందిస్తూ… చిరంజీవి గారు సాధారణంగా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అలాగే సరిలేరు నీకెవ్వరు ఈవెంట్ లో కూడా అలానే మాట్లాడారు. నేను కూడా ఏదో ఒకటి మాట్లాడాను. నిజానికి అప్పటికి ఆయన నాతో మాట్లాడి 20 ఏళ్లకు పైనే అవుతుంది. సినిమాల్లో నటించేటప్పుడు మామూలుగానే మాట్లాడుకునే వాళ్ళం. కానీ రాజకీయాలు అన్నాక కాస్త సీరియస్ నెస్ ఉంటుంది. తిట్టుకున్నంత మాత్రాన మాట్లాడుకోకూడదు అని ఏమీ లేదుగా అని విజయశాంతి ఘాటుగా స్పందించారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

భార్య, భర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే..ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి !

సీఎం హోదాలో పెళ్లి పెద్దగా ఎన్టీఆర్… ఏకంగా పురోహితుడి గెటప్ లో!

ప్రభాస్ రిజెక్ట్ చేసిన మూవీస్…. అందులో ఎన్ని బంపర్ హిట్ అయ్యాయో తెలుసా…?

Visitors Are Also Reading