Home » యువరాజ్ కెప్టెన్ అయితే నా కెరియర్ నాశనం అయ్యేది అంటున్న హర్భజన్…!

యువరాజ్ కెప్టెన్ అయితే నా కెరియర్ నాశనం అయ్యేది అంటున్న హర్భజన్…!

by Azhar

ఐసీసీ 2008 లో మొదటిసారిగా టీ20 ప్రపంచ కప్ ను ప్రవేశపెట్టింది. ఆ సమయంలో ఎవరు హించని విధంగా మహేశ్రా సింగ్ ధోనిని కెప్టెన్ గా నియమించింది. ఇక ఆ టోర్నీలో భారత జట్టును విజేతగా నిలపడంతో కెప్టెన్ గా అతడినే కొనసాగించింది బీసీసీఐ. కానీ ఆ టోర్నీ ముందు వరకు కూడా గంగూలీ తర్వాత కెప్టెన్సీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ దే అనుకున్నారు. ఎందకంటే అప్పటివరకు జట్టుకు అతనే వైస్ కెప్టెన్ గా వ్యవరించేవాడు. కానీ బీసీసీఐ మాత్రం ధోనికే ఓటు వేసింది.

ఇక ఈ విషయం పై యువరాజ్ కూడా చాలాసార్లు తన అసహనాని వ్యక్తం చేసాడు. 2019 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఈ కెప్టెన్సీ విషయంలో నాకు అన్యాయం జరిగింది అంటూ కామెంట్స్ చేస్తూనే ఉంటాడు. కానీ ఒకవాలె నిజంగా అప్పుడు ధోని కాకుండా యువరాజ్ కెప్టెన్ గా అయితే మాత్రం నా కెరియర్ అలాగే జట్టు భవిష్యత్ కూడా అప్పుడే నాశనం అయ్యేది అని హర్భజన్ సింగ్ అన్నాడు.

తాజాగా హర్భజన్ మాట్లాడుతూ.. ఒకవేళ యువరాజ్ కెప్టెన్ అయితే.. మేము అందరం తొందరగా పడుకొని.. లేటుగా నిద్రలేచే వాళ్ళం. అందువల్ల ఇన్త లాంగ్ కెరియర్ ఉండకపోవచ్చు అంటూ నవ్వుతు చెప్పాడు. ఇక ఆ తర్వాత ఒకవేళ యువి కెప్టెన్ అయితే మాత్రం అద్భుతమైన లిడార్ అయ్యేవాడు. యువి గురించి అతను రికార్డులే మనకు చెబుతాయి. 2008, 2011 ప్రపంచ కప్ లలో అతను ఆడిన ఇన్నింగ్స్ లు అతనికి దక్కిన అవార్డులు చూస్తే చాలు అతను ఎంత గొప్ప కెప్టెన్ అయ్యేవాడు అని చెప్పడానికి అంటూ హర్భజన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి :

నా వల్లనే గంగూలీ కెప్టెన్సీ నిలబడింది.. లేకుంటే..?

శ్రీశాంత్ ను కొట్టడం పై స్పందించిన హర్భజన్…!

Visitors Are Also Reading