Home » అర్జున్ టెండూల్కర్ కు కపిల్ దేవ్ సూచనలు.. మీ నాన్నలో సగం ఆడినా..?

అర్జున్ టెండూల్కర్ కు కపిల్ దేవ్ సూచనలు.. మీ నాన్నలో సగం ఆడినా..?

by Azhar
Ad
సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ పైన గత కొన్ని రోజులుగా చాలా చర్చ జరుగుతుంది. అందుకు కారణం ఈ ఐపీఎల్ 2022 లో అతనికి ముంబై ఇండియన్స్ అవకాశం ఇవ్వకపోవడమే. ఈ ఏడాది జరిగిన మెగవేలంలో 30 లక్షలకు అర్జున్ ను కొనుగోలు చేసిన ముంబై యాజామాన్యం జట్టులో అందరూ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. కానీ అర్జున్ ను మాత్రం ఆడించలేదు. అందులో సచిన్ ఫ్యాన్స్ ముంబై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇండియాకు మొదటి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ కూడా తాజాగా అర్జున్ గురించి మాట్లాడాడు. కపిల్ దేవ్ మాట్లాడుతూ… ఇప్పుడు అందరూ సచిన్ కొడుకు కావడం వల్లనే అర్జున్ గురించి మాట్లాడుతున్నారు. కానీ అలా చేయకండి. అర్జున్ మీద ఒత్తిడి పెంచకండి. అతను ఇక్క చిన్నపిల్లాడు మాత్రమే. అప్పుడే అతని ఆటను సచిన్ తో పోల్చడం సరైన విషయం కాదు. అతని పేరు వెనుక ఉన్న టెండూల్కర్ కారణంగా అర్జున్ కు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అంతకంటే కువగా నష్టాలూ ఉన్నాయి అనేది నిజం అని కపిల్ అన్నారు.
ఎందుకంటే మనకు ఈ టెండూల్కర్ పేరు వినగానే అర్జున పైన భారీ అంచనాలు వస్తుంటాయి. సచిన్ క్రియేట్ చేసిన క్రేజ్ అలాంటిది. అదే విధంగా అర్జున్ సచిన్ కొడుకు. కాబట్టి మనం అతనికి ఆట గురించి చెప్పడానికి ఏం ఉండదు.  కానీ అర్జున్ కు నా సలహా ఏంటంటే.. అర్జున్ నువ్వు ఆట మీద మాత్రమే ఫోకస్ చేయాలి. బయట జరిగే ఈ విషయాలను పట్టించుకోకూడదు. మీ నాన్న ఆడినా ఆటలో సగం ఆడినా కూడా నువ్వు గొప్ప ఆటగాడివి అవుతావు అని కపిల్ అన్నారు.

Advertisement

Visitors Are Also Reading