Home » బిగ్ బాస్ 6లోకి ప్రముఖ హీరో.. రెమ్యూనరేషన్ ఎంత అడుగుతున్నారంటే..!!

బిగ్ బాస్ 6లోకి ప్రముఖ హీరో.. రెమ్యూనరేషన్ ఎంత అడుగుతున్నారంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

బిగ్ బాస్ ప్రస్తుతం తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో టాప్ షోగా పేరు పొందింది. ముందుగా ఈ షో ప్రారంభమైనప్పుడు దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. నాగార్జున హోస్ట్ గా వచ్చిన తర్వాత షో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం టాప్ షోగా పేరు సంపాదించుకుంది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని, ఆరో సీజన్ ప్రారంభానికి శ్రీకారం చుడుతోంది. ఐదో సీజన్లో 24 అవర్స్ బిగ్ బాస్ ఓటీటీలో ప్రసారం చేసింది. ఈ విధంగా ఈ షో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ తరుణంలో సెప్టెంబర్ మొదటి వారంలోనే 6వ సీజన్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

దీంతో ఈ షోపై అనేక అంచనాలు పెరిగాయి. కంటెస్టెంట్ లో ఈసారి ఎవరెవరు వస్తారనేది విపరీతంగా చర్చసాగుతోంది. కొంతమంది పేర్లు ఇప్పటికే నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే ఈ లిస్ట్ లోకి తాజాగా అలనాటి ప్రముఖ హీరో వడ్డే నవీన్ కూడా చేరిపోయారు. ఒకప్పుడు చాలా సినిమాలు చేసి స్టార్ హీరోగా పేరొందిన నవీన్, సినిమాలకు దూరమై పోయి, కనీసం ఏ ఈవెంట్ లో కూడా కనిపించలేదు. అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు..ఏం చేస్తున్నాడు అనే విషయం కూడా ఎవరికీ తెలియదు.

Advertisement

అలాంటి ఆయన ఒక్కసారిగా బిగ్ బాస్ షోకి వస్తున్నారని ప్రచారం విపరీతంగా సాగుతోంది. అయితే ఈ షోలో ఆయన చేయడానికి ఒప్పుకోలేదట. కానీ ఆయనను ఎలాగైనా ఒప్పించాలని భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే బిగ్ బాస్ 6 లో నవీన్ ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈసారి లిస్టులో జబర్దస్త్ కామెడీయన్ ఆది, వర్షిని, దీప్తి పిళ్లి, యాంకర్ ధనుష్ ఇంకా కొంత మంది పేర్లు వినిపిస్తున్నాయి.

also read;

రావు గోపాల్ రావు కి కమెడియన్ పృథ్వికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా ? అయన గదిలో 40 రోజులు ఎందుకు ఉన్నారు ?

అక్క‌డ‌ పానీపూరి అమ్మ‌కాలు నిషేదం.. ఎందుకంటే..?

 

Visitors Are Also Reading