టెక్నాలజీ రోజుకు రోజుకు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ప్రతీ ఒక్కరు ఆర్థిక లావాదేవీలను మొబైల్ ఫోన్ ల ద్వారానే చేస్తున్నారు. ప్రధానంగా యూపీఐ, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. అంతేకాదు.. చాలా మంది ప్రస్తుతం క్రెడిట్ కార్డు విధానంలోనే బిల్లులు చెల్లిస్తున్నారు. ఒకటి కన్నా ఎక్కువగా క్రెడిట్ కార్డు ఉన్నవారు ప్రతినెల గడువులోపు ఆ బిల్లులను చెల్లించడం మరిచిపోతున్నారు.
బిల్ పే చేయడం మరిచిపోయినప్పటికీ లేదా చెల్లింపు తేదీ కంటే మూడు రోజుల తరువాత చెల్లిస్తే ఫైన్ తో సహా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అయితే తాజాగా ఇకపై ఇలా ఫైన్ తో సహా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ప్రకారం.. క్రెడిట్ కార్డు.. జారీ చేసిన సంస్థ చేసిన చెల్లింపు కోసం మాత్రమే చార్జ్ చేయాలి. బిల్లు చెల్లించే తేదీ కంటే మూడు రోజుల తరువాత చెల్లిస్తే మీ క్రెడిట్ కార్డు పై మనం చెల్లించిన ఎక్స్ ట్రా డబ్బు కూడా తిరిగిపొందవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read : ఆ బాలీవుడ్ హీరోయిన్ కోసం పేరు మార్చుకున్న కోహ్లీ
ఏప్రిల్ 21, 2022 జారీ చేయబడిన క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు సంబంధించిన సూచనల ప్రకారం.. క్రెడిట్ కార్డు ఖాతాలో మూడు రోజుల కంటే ఎక్కువగా అప్పు ఉన్నప్పుడు మాత్రమే కార్డు జారీ చేసేవారు క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ ఛార్జీని విధించవచ్చని ఆర్భీఐ పేర్కొంది. చివరి తేదీ వరకు బిల్లు చెల్లించకపోతే మూడు రోజుల తరువాత ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చెల్లించుకోవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. కొత్త క్రెడిట్ కార్డును తీసుకున్నవారు గడువు తేదీ ముగిసిన మూడు రోజుల తరువాత కూడా పూర్తిగా అప్పు చెల్లించుకోకపోతే మాత్రం అప్పుడు తప్పకుండా క్రెడిట్ కార్డుపై అదనపు చార్జీలు విధిస్తుంది.
Also Read : సామాన్యులకు శుభవార్త.. తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం.. ఎంత శాతం అంటే..?