Home » పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నరకం చూస్తున్న ఆటగాళ్లు..!

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో నరకం చూస్తున్న ఆటగాళ్లు..!

by Azhar
Ad
2008 లో మన బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ అనేది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. ఈ ఐపీఎల్ కారణంగానే మన బీసీసీఐ ప్రపంచంలోనే అన్ని క్రికెట్ బోర్డు కంటే ధనిక బోర్డుగా అవతరించింది. అయితే మన ఐపీఎల్ ను చూసి చాల దేశాల బోర్డులు లీగ్ క్రికెట్ అనేది ప్రారంభించాయి. అందులో మన దాయాధి దేశమైన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రారంభించిన పాకిస్థాన్ సూపర్ లీగ్ అనేది కూడా విషయం తెలిసిందే. అక్కడి ప్రజలు ఎప్పుడు ఈ పాకిస్థాన్ లీగ్ మన ఐపీఎల్ కంటే ఎక్కువ అంటూ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
కానీ అక్కడ పాకిస్థాన్ లీగ్ లో ఆడిన చాలా మంది విదేశీ ఆటగాళ్లు మాత్రం దాని పైన చాలా సజోకింగ్ కామెంట్స్ చేసారు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు జేమ్స్ ఫాల్కనర్ పాకిస్థాన్ లీగ్ లో ఆడినందుకు తనకు ఇవ్వాల్సిన అమౌంట్ మొత్తం ఇవ్వలేదు అని పేర్కొన్నాడు. ఇక ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ ఆటగాడు జేసన్ రాయ్ కూడా ఈ లీగ్ పైన షాకింగ్ కామెంట్స్ చేసాడు. అక్కడ నరకం కనిపించింది అని పేర్కొన్నాడు.
తాజాగా రాయ్ మాట్లాడుతూ… నేను పాకిస్థాన్ లీగ్ లో ఆడినప్పుడు అసలు సంతోషంగా లేను. అక్కడ నేను పరుగులు చేసిన విజయాలు అందుకున్న ఏది ఒక్క మధ నన్ను వెంటాడేది. అక్కడ ఒత్తిడి అనేది ఎక్కువైంది. నా జీవితంలో అదో చీకటి సమయం. నేను అక్కడ ఆదినాన్ని రోజులు నరకం చూసాను అని రాయ్ తెలిపాడు. ఇక ఆ కారణంగానే తాను ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా ఆడలేకపోయాను అని చెప్పాడు. అయితే ఈ ఐపీఎల్ 2022 మెగవేలంలో రాయ్ ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేయగా.. బయోబాబుల్ కారణంగా తాను ఈ ఏడాది ఐపీఎల్ లో పాల్గొనలేను అని తప్పుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Visitors Are Also Reading