Home » దసరా క్లైమాక్స్ మామూలుగా లేదంట.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

దసరా క్లైమాక్స్ మామూలుగా లేదంట.. ఫ్యాన్స్ కి పూనకాలే..!

by Anji
Ad

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా సినిమా దసరా. ఈ సినిమా పై నాని బోలెడన్నీ ఆశలు పెట్టుకున్నాడు. దసరా సినిమా కోసం నాని చాలా కష్టపడ్డాడు. మునుపెన్నడూ కనిపించనంత ఊరమాస్ లుక్ లో కనిపించనున్నాడు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read :  పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!

Advertisement


సింగరేణి నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. నాని నటనతో మరోసారి ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది దసరా మూవీ. వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందట. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో క్లైమాక్స్ సీన్ కోసం భారీగానే ఖర్చు చేశారట. 15 నిమిషాలకు పైగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉంటుందట.

Advertisement

Also Read :  అల్లరి నరేష్ ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడా ?


భారీ సెట్టింగ్ భారీ బడ్జెట్ ఈ సినిమా షూటింగ్ జరిపారట. సినిమా అంతా ఒక ఎత్తయితే.. క్లైమాక్స్ మరో ఎత్తు అంటున్నారు . ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ వంటి భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రం సబ్జెక్ట్ పాన్ ఇండియా ఆడియన్స్ కి నచ్చుతుందనే ధీమాతో ఉన్నారు చిత్ర యూనిట్. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం మార్చి 30 వరకు వేచి చూడాల్సిందే.

Also Read :  రమ్యకృష్ణ గురించి దర్శకుడు కృష్ణవంశీ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోక ఉండరు..!

Visitors Are Also Reading