Home » గ్రీన్ టీ తాగితే మంచిదే.. కానీ ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

గ్రీన్ టీ తాగితే మంచిదే.. కానీ ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

by Anji
Ad

ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం పై అవగాహన పెరుగుతోంది. ఒకప్పుడు టీ, కాఫీలు ఎడాపెడ తాగే వారు ఇప్పుడు గ్రీన్ టీని తాగడాన్ని అలవాటు చేసుకుంటున్నారు. గ్రీన్ టీలో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు గ్రీన్ టీని తీసుకుంటున్నారు. రుచికి చేదుగా ఉన్నా, ఆరోగ్యానికి మంచిదనేల కారణంతో గ్రీన్ టీని అలవాటు చేసుకుంటున్నారు అయితే గ్రీన్ టీ తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చనే దాంట్లో ఎంత నిజం ఉందో.. గ్రీన్ టీ తీసుకునే సమయంలో చేసే కొన్ని తప్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఇంతకీ గ్రీన్ టీ తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

భోజనం చేసిన వెంటనే ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ టీని తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే గ్రీన్ టీ తాగితే జీర్ణ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఆహారంలో ఉండే ప్రోటీన్లను శరీరం శోషించుకోకుండా గ్రీన్ టీ అడ్డుకునే అవకాశం ఉంటుంది.

ఇక గ్రీన్ టీ తాగిన వెంటనే కూడా భోజనం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దీని వల్ల కూడా జీర్ణ క్రియపై ప్రభావం చూపుతుంది. గ్రీన్ టీ తాగిన కనీసం గంట వరకు ఎలాంటి భోజనం తీసుకోకూడదని చెబుతున్నారు.

Advertisement

ఇక గ్రీన్ టీ ని బాగా వేడిగా కానీ, బాగా చల్లగా కానీ ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఈ రెండింటి వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి గ్రీన్ టీని గోరువెచ్చగానే తీసుకోవాలి. అలా అయితేనే గ్రీన్ టీ ఫలితం లభిస్తుంది.

 

కొంత మంది ఉదయం లేవగానే పడగడుపు గ్రీన్ టీని తీసుకుంటుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల జీర్ణక్రియపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. బ్రేక్ ఫాస్ట్ చేసి ఒక గంట తర్వాత గ్రీన్ టీ తీసుకుంటే మేలు జరుగుతుంది.

ఇక గ్రీన్ టీని తాగేటప్పుడు ఎలాంటి ట్యాబ్లెట్స్ వేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. కనీసం గంట గ్యాప్ ఇచ్చిన తర్వాతే టాబ్లెట్స్ వేసుకోవాలి. గ్రీన్ టీ, టాబ్లెట్స్ వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రోజుకు రెండు కప్పులకు మించి గ్రీన్ టీ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెబుతున్నారు.

Visitors Are Also Reading