విమానం అనగానే మనకు కలర్‌పుల్‌గా ఉంటే బాగుంటుందనే ఆలోచన తడుతుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో విమానాలున్నాయి. కానీ ఏ విమానం కూడా నలుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇలాంటి కలర్స్‌లో ఉండదు. అన్నీ తెలుపు కలర్‌లోనే ఉంటాయి. అసలు మీకు ఎప్పుడైనా ఈ సందేహం కలిగిందా..? మాకు కలిగిన సందేహంతో మీ కోసం జవాబు తీసుకొచ్చాం.
Advertisement
విమానానికి తెలుపు రంగా వేయడానికి ప్రధాన కారణం సూర్యకిరణాలు. తెలుపు రంగు కారణంగా సూర్యుని కిరణాలు పరావర్తనం చెందుతాయి. తద్వారా విమానం బాడీ ఉష్ణోగ్రత పెరగదట. తెలుపు రంగుకు బదులుగా మరే రంగును వాడినా.. విమానం సూర్యకిరణాలను పరావర్తనం చేయకుండా శోశిస్తుంది. దీంతో ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుంది.
మరొక కారణం ఏమిటంటే..? విమానానికి తెలుపు రంగు వేయడం వల్ల సోలార్ రేడియేషన్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ రేడియేషన్ కారణంగా విమానం వేడెక్కదు. అంతేకాదు. విమానాలు గంటల తరబడి ఆకాశంలో ప్రయాణించడమే కాకుండా రన్‌వేఊ పైనా ఎండలోనే ఉంటాయి. తద్వారా ఎండ వేడిమి విమానాలపై పడుతుంది. ఆ ప్రభావం విమానాలపై పడకుండా ఉండేందుకు వాటిని తెలుపు రంగు వేస్తారు.
Advertisement
విమానాలు సాధారణంగానే చాలా ఎత్తులో ఎగురుతాయి. ఈ నేపథ్యంలో వాటి రంగు తెల్లగా లేకపోతే.. కాలక్రమేణా వాటి రంగు తేలిపోతుంది. వాటి నిర్వహణ భారమవుతుంది. ఖర్చు కూడా పెరుగుతుంది. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో నష్టాలను భరించడానికి టికెట్ల ధరలను కూడా భారీగానే పెంచాల్సి వస్తుంది. అదేవిధంగా తెల్లగా ఉన్నప్పుడు దానికి ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే కనిపెట్టవచ్చు. ముఖ్యంగా తెలుపు రంగు వేయడం వల్ల పక్షులు కూడా వాటిని గుర్తించి ఢీ కొట్టకుండా ఉంటాయట. ఇలా విమానాలకు తెలుపు రంగు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. అందుకే తెలుపు రంగు కాకుండా మరొక రంగు వేయడం లేదు.
ఇవి కూడా చదవండి :
Bahubali : బాహుబలిలో ఉపయోగించిన త్రిశూల వ్యూహం గురించి మీకు తెలుసా..?
హీరో వెంకటేష్ కోసం ఓ హీరోకు అన్యాయం చేసిన చిరంజీవి..!
రెండో పెళ్లి చేసుకున్న గెటప్ శ్రీను.. ఫోటోలు వైరల్..!