Home » హీరో వెంకటేష్ కోసం ఓ హీరోకు అన్యాయం చేసిన చిరంజీవి..!

హీరో వెంకటేష్ కోసం ఓ హీరోకు అన్యాయం చేసిన చిరంజీవి..!

by Sravanthi Pandrala Pandrala
Ad

విక్టరీ వెంకటేష్ తన సినీ జీవితంలో ఎన్నో బ్లాక్ బ్లాస్టర్ హిట్లను అందుకున్నారు. వెంకటేష్ తన సినిమాల్లో మర్చిపోలేని హిట్ మూవీ చంటి. ఈ సినిమా క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై అగ్ర నిర్మాత అయిన కె.ఎస్.రామారావు నిర్మించారు. పినిశెట్టి రవిరాజా దర్శకులు. అమ్మ,చెల్లి సెంటిమెంట్ పై వచ్చిన ఈ మూవీ అప్పట్లో చాలా విజయవంతమైంది. ఈ సినిమాలో ప్రేమ సెంటిమెంట్ తో పాటుగా పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ మూవీ మొత్తం ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి కి ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. లేక లేక పుట్టిన చెల్లెను వారు ముగ్గురూ అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఇందులో వెంకటేష్ ఏమీ తెలియని అమాయకుడిగా నటించాడు.

Advertisement

ఈ అమాయక హీరోకి తల్లి మాత్రమే లోకం. అయితే ఈ వెర్రిబాగుల చంటి ని నందినికి రక్షణగా పెడతారు ఆ ముగ్గురు అన్నదమ్ములు. అయితే చంటి అమాయకత్వాన్ని చూసి నందిని అతనితో ప్రేమలో పడుతుంది. చివరికి నందినిని ఇచ్చి చంటి కి వివాహం చేస్తారు. ఇది సినిమా సారాంశం. అయితే ఈ మూవీ తమిళంలో చిన్న తంబి గా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఈ మూవీని రీమేక్ చేయాలని కె.ఎస్.రామారావు సినిమా రిలీజ్ కాకముందే అనుకున్నారు. తెలుగులో చేస్తే రాజేంద్రప్రసాద్ తో చేయాలని భావించారట. ఈ సమయంలో సురేష్ బాబు కె.ఎస్.రామారావు దగ్గరికి వెళ్లి ఈ మూవీ వెంకటేష్ తో చేయాలని అడిగారు.

Advertisement

 

ఈ సందర్భంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా రంగంలోకి దిగి ఈ మూవీకి వెంకటేష్ హీరోగా పెట్టి చేయాలని దర్శకుడు రవిరాజా పినిశెట్టి ఒప్పించారట. ఆ సమయంలో చిరంజీవికి మరియు రాజేంద్ర ప్రసాద్ కు మధ్య ఏం లేకపోయినా సరే వెంకటేష్ కు ఈ కథ బాగా సూట్ అవుతుందని చిరు భావించారట. అలాగే తనకు మంచి ఫ్రెండ్ అయినా రవిరాజా పినిశెట్టి కి ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలని చిరు ప్లాన్ వేశారట. అటు చిరు ఇటు సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వడంతో ఈ మూవీ నుంచి రాజేంద్రప్రసాద్ ను పూర్తిగా సైడ్ చేశారట. ఆ సమయంలో రాజేంద్రప్రసాద్ కు దక్కాల్సిన ఇటువంటి బ్లాక్ బాస్టర్ హిట్ వెంకటేష్ ఖాతాలో పడిపోయింది. అప్పట్లో ఈ మూవీ రికార్డులను కూడా తిరగరాసింది అని చెప్పవచ్చు.

Visitors Are Also Reading