గాలిపటాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు తెలుగు ప్రజలు. ఈ పండుగ ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలను తిథి ఆధారంగా జరుపుకుంటే, సంక్రాంతి పండుగను మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటారు. అందుకే సంక్రాంతి పండుగ తేదీలలో మార్పు ఉండదు అని గమనించాలి. సంక్రాంతి పండుగ రోజు సూర్యుడు దక్షిణయానం పూర్తి చేసుకుని ఉత్తరాయానంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటారు.
READ ALSO : ‘చమ్కీల అంగిలేసి’ పాట పాడిన ఈ సింగర్ గురించి తెలుసా…!
Advertisement
Advertisement
ఆ సమయంలో మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి అని పిలుస్తుంటారు. సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ మూడు రోజుల పాటు అనగా భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు.అయితే ఈ పండుగలు గాలిపటాలది ఓ ప్రత్యేక స్థానం. వాస్తవానికి మన ప్రతి సాంప్రదాయాల వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉంటుంది. అలాగే గాలిపటాలు ఎగురవేయడం వెనుక చాలా కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను సాధారణంగా పగలే ఎగరవేసేవారు.
ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు ప్రకాశవంతంగా ఉంటాయి. చల్లని గాలికి శరీరానికి ఎక్కువ ఇబ్బందిగా ఉండదు. కాబట్టి గాలిపటాలు ఎగరేసేటప్పుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్య కిరణాలు తాకుతాయి. సూర్యకిరణాలు మన శరీరానికి, చర్మానికి చాలా ఉపయోగకరం. శరీరంలో ఉన్న చెడు బ్యాక్టీరియా కొంతవరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సంప్రదాయం వచ్చింది.
READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!