Home » స్టార్ హీరో, హీరోయిన్లు కొబ్బరి నీళ్లను ఎందుకు తాగుతారో తెలుసా ?

స్టార్ హీరో, హీరోయిన్లు కొబ్బరి నీళ్లను ఎందుకు తాగుతారో తెలుసా ?

by Anji
Ad

కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సాధారణంగా మార్నింగ్ వాక్ కి వెళ్లేటప్పుడు కొందరూ కొబ్బరి నీళ్లు తాగడాన్ని తరచుగా చూస్తారు. చాలా మంది నటులు లేదా ఫిట్ నెస్ ఫ్రీక్స్ ల ఆహారంలో కొబ్బరి నీరు తప్పనిసరి. కొబ్బరినీరు చాలా రుచికరంగా ఉండడంతో పాటు  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆరోగ్యం పై అవగాహన ఉన్నవారు  కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగడానికి ఇష్టపడతారు. కొబ్బరి నీళ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కేలరీలు, చక్కెర, పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పలువురు హీరోలు, హీరోయిన్స్ కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముఖ్యంగా బరువు తగ్గడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే బయోయాక్టివ్ ఎంజైమ్ లు జీవక్రియను పెంచి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. నీళ్లు తాగడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయి. మీరు ఫిట్ బాడీని పొందాలంటే ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్ళు తాగాలి. రక్తపోటును కూడా నియంత్రిస్తాయి. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటు రోగులకు కొబ్బరి నీళ్లు తాగడం చాలా మేలు చేస్తుంది.

Advertisement

Manam News

కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొబ్బరి నీరు శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. దీనిని తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పోతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి. పిత్తాశయం రాళ్లను తొలగిస్తాయి: కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్ గా చేస్తుంది. ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి పనిచేస్తుంది. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇది కిడ్నీ స్టోన్ ప్రమాదాన్ని తొలగిస్తుంది.

Also Read :  నా భర్త నన్ను దగ్గరకు రానివ్వడం లేదు..కారణం..!!

Manam News

కొబ్బరి నీళ్లలో ఉన్నటువంటి గుణాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. మొటిమల సమస్యను తొలగించడానికి కొబ్బరి నీరు పనిచేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసే విధంగా చేస్తుంది. అందుకే ఇన్ని పోషకాలు, ఖనిజాలు ఉన్న కొబ్బరి నీటిని తరచూ హీరోయిన్లు, హీరోలు తీసుకుంటారని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంకా కొబ్బరి నీటిని తీసుకోవడం వల్ల తక్షణమే శక్తి వస్తుందని.. ఎనర్జిటిక్ గా ఉంటారని పేర్కొంటున్నారు.

Also Read :   రోజుకు 10 నిమిషాలు మౌనంగా ఉండడం వల్ల కలిగి ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading