Home » మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ ని ఎందుకు వీడాలనుకుంటున్నాడో తెలుసా ?

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య బీఆర్ఎస్ ని ఎందుకు వీడాలనుకుంటున్నాడో తెలుసా ?

by Anji
Ad

గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ టికెట్ అశించి భంగపడ్డ రాజయ్య, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బుజ్జగింపుతో పోటీకి దూరంగా ఉన్నారు. ఆయన స్థానంలో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు గులాబీ బాస్. దీంతో అప్పటి నుంచే ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు రాజయ్య. తనకు టిక్కెట్‌ కేటాయించకపోవడం ద్వారా మాదిగల ఆత్మగౌరవం దెబ్బతిన్నదన్నారు మాజీ ఎమ్మెల్యే రాజయ్య.

Advertisement

 ముఖ్యంగా  అధికార పార్టీపై సొంత పార్టీ నేతల వ్యాఖ్యలు నచ్చలేదన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కు గత ప్రభుత్వం చివరి నిమిషంలో రైతు బందు సమితి చైర్మన్ పదవి కట్టబెట్టింది. ఆ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల వ్యవధిలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ పదవి ఒక్కరోజు ముచ్చటయింది. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంటి ముట్టనట్లుగానే వ్యవహరించారు రాజయ్య. రాజయ్య తన నియోజకవర్గాన్ని వదిలి పెట్టి జనగామలో ప్రచారం నిర్వహించారు.

Advertisement

ఈ క్రమంలోనే గత ఆరునెలల నుండి తీవ్ర మనోవేధనతో ఉన్న రాజయ్య, బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమయ్యారు. ఎంపీ సీటు ఆశించిన ఆయనకు పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పదానికి సిద్ధపడ్డారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు పంపించాలనుకుంటున్నారు. రాజయ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జోరందుకుంది.  రాజయ్య వరంగల్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్లు సమాచారం.

మరిన్నీ  తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading