Home » సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో ఎందుకు దాచుకుంటారో తెలుసా ?

సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో ఎందుకు దాచుకుంటారో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ చాలా ఎక్కువగానే ఉంటారు. వారికి చిన్న పిల్లలు ఉన్నప్పుడు తరచుగా ఓ విషయాన్ని గమనించవచ్చు. అది ఏంటంటే.. పిల్లల ముఖాన్ని దాచిపెట్టేందుకు ఫోటోలలో ఎమోజీలను వాడుతుంటారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాలను అసలు ఎందుకు దాచుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

కొద్ది వారాల కిందట టీమిండియా దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ, నటి అనుష్క శర్మ దంపతుల పాప వామికా ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఇద్దరూ సెలబ్రిటీల డై హార్డ్ అభిమానులు బేబీ వామిక ఫోటోలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని పట్టుబట్టారు. సెలబ్రిటీల పిల్లల ముఖాలను చూసేందుకు అభిమానులు, ప్రజలలో ఉత్సాహం రావడం చాలా సహజం. తల్లిదండ్రులైన సెలబ్రిటీలు తమ పిల్లల ముఖాన్ని ప్రజలకు కనిపించకుండా ఎందుకు దాచడానికి ప్రయత్నిస్తారనేది సందేహం సహజం. సాధారణంగా సెలబ్రిటీలు తమ పిల్లలను గోప్యతను పరిగణలోకి తీసుకోవడం ఇందుకు కారణం. ఎక్కువగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమ జీవితంలోని ప్రతీ ఇతర అంశాలను తమ అభిమానులు, అనుచరులతో పంచుకుంటారు. వారి పిల్లల ముఖాన్ని హార్ట్ లేదా పిల్లల ఎమోజీలతో కప్పి ఉంచడం వెనుక కారణం వారి పిల్లల కోసం వారి చుట్టూ గోప్యతా కంచెను నిర్మించే ఎత్తుగడగా పరిగణిస్తారు. 

Manam News

ముఖ్యంగా బేబీ వామికా ఫోటో సోషల్ మీడియాలో లీక్ కావడానికి ముందే అనుష్క శర్మ తమ పాప ఫోటోను ప్రచురించనందుకు మీడియాకి కృతజ్ఞతలు తెలిపింది. ఇక ఈ విషయం పై అనుష్క శర్మ ఇంతకు ముందు ఇన్ స్టా గ్రామ్ లో మాట్లాడాతూ.. “ మా బిడ్డకి ప్రైవసీ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీడియా, సోషల్ మీడియాకి దూరంగా తన జీవితాన్ని స్వేచ్ఛగా జీవించే అవకాశాన్ని ఆమెకు అందించడానికి మేము చేయగలిగినంతా చేయాలనుకుంటున్నాం. కాబట్టి మీ మద్దతు మాకు కావాలి. ఈ విషయంలో అందరూ సంయమనం పాటించాలని కోరుతున్నాం” అని చెప్పారు.  

Also Read :  నందమూరి తారకరత్నకు మరో ప్రాణాంతకమైన వ్యాధి!

Advertisement

Manam News

 

 

ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా, రణబీర్ ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తమ పాప రాహా కోసం “ No Photo Policy” అభ్యర్థించారు. దయచేసి మా పాప ఫోటోలను క్లిక్ చేయకండి. పొరపాటున కూడా చిన్నారి ఫ్రేమ్ పై క్లిక్ చేసినా దానిని పబ్లిష్ చేస్తే పిల్లల ముఖాన్ని దాచేందుకు హార్ట్ ఎమోజీ వంటి ఎమోజీలను ఉపయోగించాలని వారు తెలిపారు. రణబీర్ చెప్పినట్టుగా మీరు మమ్మల్నీ క్లిక్ చేస్తే.. నేను అసలు పట్టించుకోను. కానీ నా బిడ్డ పెద్ద అయిన తరువాత ఆమె ఫోటో తీయడం మంచిది కదా అని అర్థం చేసుకునే వరకు మా పరిస్థితి ఇదే. నా బిడ్డ ముఖాన్ని బయటపెట్టవద్దని కోరాడు.  

Also Read :  : తారక రత్న హెల్త్ బులిటెన్ సరికొత్త విషయాలను బయటపెట్టిన వైద్యులు !

Manam News

నటి సోనమ్ కపూర్ గత ఆగస్టులో తన కొడుకు కి జన్మనిచ్చింది. కొడుకు వాయు ముఖాన్ని సోనమ్ ఇంకా చూపించలేదు. తన కుమారుడు ముఖంతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేస్తారనే ప్రశ్నకు నటి సోనమ్ కపూర్ స్పందిస్తూ.. కొడుకు పెద్ద అయిన తరువాత దాని గురించి ఆలోచించను. ఇంకా అతను స్వయంగా నిర్ణయించే వరకు అతని ముఖాన్ని ప్రచురించడం గురించి నేను ఆలోచించను” అని చెప్పాడు.   

Also Read :   శర్వానంద్ కు కాబోయే భార్య అన్ని కోట్లకు వారసురాలా…?

Manam News

ప్రియాంక చోప్రా, నిక్ దంపతులు కూడా ఇతర ప్రముఖుల మాదిరిగానే ఫోటోలో తమ బిడ్డ యొక్క ముఖాన్ని బహిర్గతం చేయలేదు. తమ పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోను షేర్ చేసినా.. వారు తమ ముఖాన్ని చూపించకూడదు అని.. నిర్ణయించుకున్న తరువాత మీరు మీ బిడ్డ ఫోటోను ఎందుకు షేర్ చేస్తారని ఇన్ స్టా గ్రామ్ లో వినియోగదారులు ప్రశ్నించారు.  

Also Read :  చిరు, బాలయ్యలో ఉన్న కామన్ పాయింట్.. తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..?

Visitors Are Also Reading