Home » నందమూరి తారకరత్నకు మరో ప్రాణాంతకమైన వ్యాధి!

నందమూరి తారకరత్నకు మరో ప్రాణాంతకమైన వ్యాధి!

by Bunty
Ad

ఎన్టీఆర్ మనవడు అయిన నందమూరి తారకరత్న ఆరోగ్యానికి సంబంధించి అప్డేట్ వచ్చింది. హీరో నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ఆసుపత్రికి చేరుకున్నారు. వైద్యబృందంతో మాట్లాడిన చంద్రబాబు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు.

Advertisement

తారకరత్నకు పాదయాత్ర సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చిందన్నారు. కుప్పంలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించామన్నారు. తారకరత్న ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వైద్యులు శాయశక్తుల కృషి చేస్తున్నారని తెలిపారు. తారకరత్న వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు అన్నారు. ఇది ఇలా ఉండగా, తారకరత్నకు కేవలం గుండెపోటు మాత్రమే కాదు. అంతకు మించిన ప్రాణాంతక వ్యాధి కూడా ఉందని తాజాగా వైద్యులు నిర్ధారించారు. అదే మెలెనా అయితే తారకరత్నకు వచ్చిన ఈ మెలెనా వ్యాధి లక్షణాలు ఏంటి? ఎలాంటి చికిత్స చేస్తారు? అనేది ఇప్పుడు చూద్దాం.

Advertisement

మెలెనా అనేది జీర్ణశయాంతక రక్తస్రావానికి సంబంధించిన ఒక అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారిన పడిన వారి మలం జిగటగా, నల్లగా వస్తుంది. అలాగే మేలేనా వల్ల అన్నవాహిక నోరు, పొట్ట, చిన్నపేగు మొదటి భాగం రక్తస్రావానికి గురి అవుతుంది. కొన్ని కేసుల్లో ఎక్కువ జీర్ణశయాంతర దిగువ భాగంలో ఉండే పెద్ద పేగు యొక్క ఆరోహణ భాగంలో కూడా రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మెరుగైన చికిత్స ఎలా చేస్తారు అంటే, పెప్టిక్ అల్సర్స్ ట్రీట్మెంట్, ఎండోస్కోపీ థెరపీ వంటి చికిత్సలను చేస్తారని స్పెషలిస్టులు వెల్లడించారు. అలాగే యాంజియోగ్రాఫిక్ ఎంబలైజేషన్, సర్జికల్ థెరపీలతో పాటు రక్తాన్ని మార్పిడి చేయడం వంటి చికిత్సలు ఈ వ్యాధి బారిన పడిన వారికి అందిస్తారు అని సమాచారం.

READ ALSO : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Visitors Are Also Reading