Home » ఆటో డ్రైవ‌ర్స్ ఎందుకు సైడుకు కూర్చుంటారో తెలుసా?

ఆటో డ్రైవ‌ర్స్ ఎందుకు సైడుకు కూర్చుంటారో తెలుసా?

by Bunty
Published: Last Updated on

సాధారణం గా మ‌నం ఎప్పుడు చేసినా ఆటో డ్రైవ‌ర్స్ ఆటోను న‌డిపే స్టైల్ కాస్త భిన్న గా ఉంటుంది. వారు ఒక ప‌క్క కు కూర్చుండి.. ఆటో ను న‌డుపుతారు. అయితే వారు ఆలా ఎందుకు సైడ్ కు కూర్చుని ఆటోల‌ను న‌డుపుతారు అనే డౌట్ చాలా మందికే వ‌స్తుంది.

అయితే వారు స్టైల్ గా ఉంటుంద‌ని.. సైడ్ కు కూర్చుండి ఆటో న‌డుపుతార‌ని అని కొంత మంది అనుకుంటారు. నిజానికి అది వారికి స్టైల్ కాదండి బాబు. ఆటో డ్రైవ‌ర్స్ అలా సైడ్ కు కూర్చుని న‌డ‌ప‌డానికి బ‌ల‌మైన కార‌ణాలు ఉన్నాయి. కొంత మంది ఆటో డ్రైవ‌ర్స్ చెప్పిన విధానం ప్ర‌కారం వారు ఆలా సైడు కు కూర్చోవ‌డం అనేది మ‌న‌కు స్టైల్ లా అనిపించ‌దు. అయితే ఆటో డ్రైవ‌ర్స్ చెప్పిన బ‌ల‌మైన‌ కార‌ణాల‌ను ఇప్పుడు మ‌నం చూద్దం.

Also Read: ప్ర‌ధాని మోడీతో ఉపాస‌న భేటీ..కార‌ణం ఇదే..!

ఒక సైడ్ కు కూర్చుని ఆటో ను డ్రైవ్ చేయ‌డం వ‌ల్ల వారికి ప‌ట్టు ఎక్కువ గా ఉంటుంద‌ని ఆటో డ్రైవ‌ర్స్ అంటారు. హార‌న్ సౌండ్ చేయ‌డానికి, ఆటో ను బ్యాలెన్స్ చేయ‌డానికి వీలు గా ఉంటుంద‌ని అంటారు.

సాధార‌ణం గా ఆటో ల‌ను ఒక‌రి ద‌గ్గ‌ర నుంచి నేర్చుకుంటారు. పక్క‌న ఆటో డ్రైవింగ్ వ‌చ్చిన ఉంటేనే కొత్త వాళ్లు డ్రైవింగ్ చేస్తారు. అయితే ఆటో ముందు సీటు లోనే ఇద్ద‌రు కూర్చోవ‌డం వ‌ల్ల కొత్త గా నేర్చుకునే అత‌ను ఒక సైడ్ కు కూర్చుంటాడు. అప్ప‌టి నుంచి అలా సైడ్ కు కూర్చోవ‌డం అలవాటు అయిపోతుంద‌ట‌. దీంతో సాధార‌ణం గా ఆటోల‌ను న‌డుపుతున్న‌ప్పుడు కూడా ఆల‌వాటు ప్ర‌కారం సైడుకు కూర్చుంటార‌ట‌.

అలాగే మ‌రొక డ్రైవ‌ర్ చెప్పిదేమిటి అంటే.. నిజానికి ఆటో లో చాలా త‌క్కువ మంది కేపాసిటి తో ఉంటుంది. డ్రైవ‌ర్ సిట్ కాస్త పెద్ద‌గా ఉంటుంది కాబ‌ట్టి డ్రైవ‌ర్ కాస్త సైడ్ కు కూర్చుంటే మ‌రొక వ్యక్తి కూర్చునే అవ‌కాశం ఉంటుంది. దీంతో వారికి ఎక్కువ డ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. దీని కోసం కూడా ఆటో డ్రైవ‌ర్లు సైడ్ కు కూర్చుంటారు.

అలాగే ఆటో డ్రైవ‌ర్ సీటు కింద ఇంజ‌న్ ఉంటుంది. అయితే ఆటో ఎక్కువ దూరం ప్ర‌యాణం చేయడం వ‌ల్ల ఇంజ‌న్ వేడి పెర‌గుతుంది. దీంతో ఆ వేడి డ్రైవ‌ర్స్ కు త‌గులుతుంది. దీంతో కాస్త ప‌క్కకు జ‌రిగి న‌డ‌ప‌డం ద్వారా ఆ వేడి ని త‌ప్పించుకుంటారు.

Also Read: బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్ గా బాల‌య్య‌…ఇక ద‌బిడి దిబిడే..?

Visitors Are Also Reading