Home » బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్ గా బాల‌య్య‌…ఇక ద‌బిడి దిబిడే..?

బిగ్ బాస్ ఓటీటీకి హోస్ట్ గా బాల‌య్య‌…ఇక ద‌బిడి దిబిడే..?

by AJAY
Ad

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఆహా ఓటీటీలో హోస్ట్ చేస్తూ అద‌ర‌గొడుతున్నారు. రీసెంట్ గా అఖండ సినిమాతో విజ‌యం అందుకున్న బాల‌క్రిష్ణ ఎన్బీకే టాక్ షో తోనూ ఓ రేంజ్ లో వినోదాన్ని పంచుతున్నారు. బాల‌య్య టాక్ షో కావ‌డంతో పెద్ద పెద్ద సెల‌బ్రెటీలు షోకు వ‌స్తున్నారు. ఇప్ప‌టికే ర‌వితేజ‌,రాజ‌మౌళి,నాని, మెహ‌న్ బాబు లాంటి హీరోలు ఈ షోకు అతిధులుగా రాగా త్వర‌లో మ‌హేశ్ బాబు కూడా ఆహాలో సంద‌డి చేయ‌నున్నారు. మ‌హేశ్ బాబు ఎపిసోడ్ తో బాల‌య్య అన్ స్టాప‌బుల్ కు ఎండ్ కార్డు ప‌డ‌బోతుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

BALAKRISHNA

BALAKRISHNA

ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ వార్త ఫిల్మ్ న‌గ‌ర్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ కు బాల‌కృష్ణ హోస్ట్ గా చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా బిగ్ బాస్ సీజ‌న్ 5 పూర్త‌య్యిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రో రెండు నెల‌ల్లోనే బిగ్ బాస్ సీజ‌న్ 6ను ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో బిగ్ బాస్ నిర్వాహ‌కులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ సారి బిగ్ బాస్ ను ఓటీటీలో ప్ర‌సారం చేసే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు కూడా టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement

Nandamuri Balakrishna assets and properties value

అయితే ఇప్ప‌టికే బాలీవుడ్ లో కూడా ఓటీటీ బిగ్ బాస్ ను షురూ చేశారు. అక్క‌డ మంచి రెస్పాన్స్ రావ‌డంతో తెలుగులో కూడా ఓటీటీ బిగ్ బాస్ ను ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ ఓటీటీ బిగ్ బాస్ ఆర‌వ సీజ‌న్ కాద‌ని…ఇది ఓటీటీ బిగ్ బాస్ అని కొంద‌రు అంటుంటే మ‌రికొందరు మాత్రం ఇదే ఆర‌వ సీజ‌న్ అని అంటున్నారు. ఏది ఐమైనా ఇప్పుడు బాల‌య్య బిగ్ బాస్ కు హోస్ట్ గా చేయ‌బోతున్నారు అనే వార్త మాత్రం నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తోంది.

also read : జ‌బర్ద‌స్త్ కు అన‌సూయ గుడ్ బై..అస‌లేం జ‌రిగింది..?

 

Visitors Are Also Reading