టాలీవుడ్ నటుడు నందమూరి వారసుడు తారకరత్న గుండె పోటు తో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితేమొదటి నుండి తారకరత్న ఆరోగ్యం ఆందోళనకరం గానే ఉంది. మొదట కుప్పం స్థానిక ఆస్పత్రికి చికిత్స అందుంచగా ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు లోని నారాయణ హృడయాలయ ఆపత్రిలో చేర్పించారు. అత్యాధునిక పరికరాల తో డాక్టర్ లు తారకరత్న కు చికిత్స అందించారు. అంతే కాకుండా తారకరత్న ను చూసేందుకు ఆయన కుటుంబీకులు బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఫ్యామిలీ తో కలిసి తారకరత్న ను పరామర్శించారు.
Advertisement
Also Read: ఎన్టీఆర్ హీరోయిన్ సమీరారెడ్డి గుర్తుందా …? ఇప్పుడు ఎలా ఉందంటే ..?
ఈ నేపథ్యంలో తారకరత్నను చూడడానికి ఒక్కొక్కరుగా ఆసుపత్రికి వెళుతున్నారు. బాలకృష్ణ దగ్గర ఉండి మరి తారకరత్నను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తారకరత్న ఫ్యామిలీకి అండగా నిలుస్తుంది నందమూరి కుటుంబం. అయితే బెంగళూరులోని ఆసుపత్రిలో నందమూరి కుటుంబీకులతో పాటు టిడిపి ఇన్చార్జ్, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు చల్లా రామచంద్రారెడ్డి కూడా ఉండడం గమనార్హం.
Advertisement
చల్ల రామచంద్రరెడ్డికి తారకరత్నతో పార్టీ పరమైన సంబంధమే కాదు బంధుత్వం కూడా ఉంది. తారకరత్నను వివాహం చేసుకున్న అలేఖ్య రెడ్డి మరెవరో కాదు చల్లా రామచంద్రారెడ్డి పెద్దమ్మ కుమార్తెనే కావడం గమనార్హం. తారకరత్న 2012 ఆగస్టు 2న సంగీ టెంపుల్ లో అలేఖ్యరెడ్డిని కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు.
అప్పట్లో తండ్రి మోహన కృష్ణతో పాటు మిగతా నందమూరి కుటుంబసభ్యుల అభిష్టానికి విరుద్ధంగా అలేఖ్యరెడ్డిని పెళ్లి చేసుకున్నారు తారకరత్న. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే అలేఖ్య రెడ్డి, చల్లా రామచంద్రరెడ్డి పెద్దమ్మ కూతురు కావడంతో తారకరత్నకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసి చల్లా కుటుంబం దిగ్భ్రాంతికి లోనైంది.
Advertisement
READ ALSO : తారక రత్న చెవిలో బాలయ్య.. మృత్యుంజయ మంత్రం చదివాడు.. అందుకే తారక్ గుండె రియాక్ట్ అయింది !