Home » బబుల్ గమ్ సినిమాలో రోషన్ ఫాదర్ గా నటించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా ?

బబుల్ గమ్ సినిమాలో రోషన్ ఫాదర్ గా నటించిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా ?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలోకి ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్ హీరోలు ఒకరి తర్వాత మరొకరు ఇండస్ట్రీ లోకి వస్తున్నారు. అలా ఈ మధ్య సింగర్ సునీత  కొడుకు కూడా హీరోగా మారారు. అతను సర్కార్ నౌకరి అనే మూవీ తో  ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక యాంకర్ సుమ కొడుకు రోషన్ కానకాల కూడా బబుల్ గమ్ మూవీతో డిసెంబర్ 29 మనం ముందుకు వచ్చి యూత్ ని చాలా అట్రాక్ట్ చేశారు.

Advertisement

ఇక ఈ సినిమాలో హద్దులు మీరిన రొమాన్స్ ఎంతోమంది యూత్ ని ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఓకే టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా కోసం యాంకర్ సుమ, రోషన్ కనకాల ఎన్నో ఇబ్బందులు పడ్డారు.ఎందుకంటే తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. డిసెంబర్ 29న విడుదలైన ఈ సినిమాలో రోషన్ కనకాల తన నటనతో మెప్పించారని చెప్పుకోవచ్చు.అయితే ఈ సినిమాలో ఉన్న రొమాన్స్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు.  ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది యూత్ ఇలాంటి సినిమాలనే ఎంకరేజ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసింది వ్యక్తి ఎవరో నీకు తెలుసా అంటూ సోషల్ మీడియాలో ఆయన ఫోటోలు వైరల్ చాలా అవుతున్నాయి. మరి ఇంతకీ బబుల్ గమ్ మూవీ లో రోషన్ ఫాదర్ గా చేసిన ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు అంత వైరల్ అవుతున్నారు.అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

బబుల్ గమ్ మూవీలో రోషన్ కనకాల ఫాదర్ గా చేసిన ఆ నటుడు ఎవరో కాదు చైతూ జొన్నలగడ్డ. ఇక జొన్నలగడ్డ అనే పేరు వినగానే మీ అందరికీ సిద్దు జొన్నలగడ్డనే గుర్తుకొస్తారు. ఇక చైతు జొన్నల గడ్డను స్క్రీన్ పై చూస్తే అందరికీ సిద్దు జొన్నలగడ్డను చూసినట్టే అనిపిస్తుంది.ఇక వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే వీరిద్దరూ సొంత అన్నదమ్ములని తెలుస్తోంది. చైతు జొన్నలగడ్డ తమ్ముడు సిద్దు జొన్నలగడ్డ .ఇక చైతు జొన్నలగడ్డకి బబుల్ గమ్ మూవీనే మొదటి మూవీ. ఈ సినిమాలో చైతు తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు.మరి ముఖ్యంగా తెలంగాణ యాసలో తన డైలాగ్స్ తో మెప్పించారు.అంతేకాకుండా తెలంగాణలో ఉండే తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఈ సినిమాలో చూపించారు.ఇలా తనదైన నటనతో బబుల్గమ్ సినిమా లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు చైతు జొన్నలగడ్డ. ఇక ఈ సినిమాలో ఈయన నటన చూసిన చాలా మంది మరిన్ని సినిమాల్లో ఈయనకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading