Home » సిక్స్ ప్యాక్ తో ఉన్నఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా ?

సిక్స్ ప్యాక్ తో ఉన్నఈ తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Anji

సాధారణంగా సినిమాల కోసం హీరోలు సిక్స్ ప్యాక్ లు, 8 ప్యాక్ లు చేస్తుంటారు. ఇక హీరోయిన్లు అనగానే సున్నితంగా ఉంటారు. గ్లామర్ తో ప్రేక్షకులను ప్రేమలో పడేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటాం. కానీ అలాంటిది టాలీవుడ్ కి చెందిన ఓ క్రేజీ హీరోయిన్ సిక్స్ ప్యాక్ బాడీతో ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చింది. అదేంటి హీరోయిన్ సిక్స్ ప్యాక్ ఆ అనుకుంటున్నారా..? నిజమేనండి. ఆమె మరెవరో కాదు ఒకప్పటి హీరోయిన్, నటుడు వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు. ఈమె గతంలో నటిగా తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేసింది.

2008లో కన్నడ సినిమాతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది వితిక షేరు. ఆ తర్వాత ఏడాదే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఝుమ్మంది నాదం, భీమిలి కబడ్డీ జట్టు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఇక 2015లో పడ్డానండి ప్రేమలో మరి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఇందులో హీరోగా చేసిన వరుణ్ సందేశ్ తో రియల్ లైఫ్ లోను ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే అప్పుడప్పుడు పలు టీవీ కార్యక్రమాలలో కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తూ నెటిజెన్లను ఆకర్షిస్తూ ఉంటుంది.

 

ఇక సోషల్ మీడియాలోనూ ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన జిమ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది వితిక. ఈమె సిక్స్ ప్యాక్ చూసిన నెటిజనులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా వితిక తన బాడీ కోసం ఎక్కువగా జిమ్ లో ట్రైన్ అవుతుంది. ఈ తరుణంలోనే తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading