Home » ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాస‌రి శ‌త్రువులు కావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

ప్రాణ స్నేహితులైన ఎన్టీఆర్-దాస‌రి శ‌త్రువులు కావ‌డానికి కార‌ణం ఎవ‌రో తెలుసా..?

by Anji
Ad

సినిమా రంగంలో నంద‌మూరి తార‌క రామారావుకు శ‌త్రువులు పెద్ద‌గా ఎవ్వ‌రూ లేరు. అంద‌రూ ఆయ‌న‌తో స్నేహంగానే ఉండేవారు. అయితే ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రినారాయ‌ణ‌రావు తొలుత ఎన్టీఆర్ కి ప్రాణ స్నేహితుడిగా ఉండేవార‌ట‌. ఏమైందో ఏమో తెలియ‌దు కానీ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టే స‌మ‌యానికి వీరిద్ధ‌రూ పెద్ద శ‌త్రువులుగా మారిపోయార‌ని అప్ప‌ట్లో సినీ ఇండ‌స్ట్రీలో టాక్ వినిపించింది. అస‌లు ఇందుకు కార‌ణం ఏంటో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఎన్టీఆర్ పాతాల‌భైర‌వి రెమ్యున‌రేష‌న్…రోజుకు రెండు ఇడ్లీలు ఒక‌వ‌డతో పాటూ నెల‌కు ఎన్ని రూపాయలంటే..?

Advertisement


టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎన్టీఆర్ ఏ పాత్ర చేసిన చాలా అద్భుతంగా ఉండేది. దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ చాలా సినిమాలే తీశారు. వీరిద్ధ‌రూ చాలా స‌న్నిహితంగానే ఉండేవారు. వీరి కాంబోలో వ‌చ్చిన స‌ర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి వంటి సూప‌ర్ హిట్ సినిమాలు వ‌చ్చాయి. దాస‌రి నారాయ‌ణ‌రావు తీసే సినిమాలు అన్న‌గారిని రాజ‌కీయంగా ప్రేరేపించాయి. ఇక్క‌డ విచిత్ర‌మేమిటంటే చిన్న‌త‌నం నుంచి దాస‌రికి ఏఎన్నార్ అంటే చాలా అభిమానం ఉండేద‌ట‌. ఆ త‌రువాత అక్కినేనితో గ్యాప్ రావ‌డంతో దాస‌రి-ఎన్టీఆర్ బంధం బాగా బ‌లప‌డింద‌ని చెబుతుంటారు. ఇక కొంత కాలానికే వీరి మ‌ధ్య వైరం పెరిగింది. ఆ స‌మ‌యంలో అస‌లు దాస‌రికి షూటింగ్ కోసం స్టూడియోలు కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని ఎన్టీఆర్ కొంద‌రికీ చెప్పేవ‌ర‌కు వెళ్లింద‌ట‌.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  రాజేంద్ర‌ప్ర‌సాద్ ఆ హీరోయిన్ గాడంగా ప్రేమించుకున్నారా.? అప్ప‌ట్లో ఆ వార్త‌లు ఎందుకు వ‌చ్చాయి..? 


ఎన్టీఆర్‌తో చాలా సినిమాలు తీసిన దాసరి నారాయ‌ణ‌రావుకి ఇలాంటి ప‌రిస్థితులు ఎదురవుతాయ‌ని ఆనాడు ఎవ్వ‌రూ కూడా ఊహించ‌లేద‌ట‌. దీనంత‌టికీ రాజ‌కీయ‌మే కార‌ణం అని కొంద‌రు అంటున్నారు. దాస‌రి ఇందిరాగాంధీ పెద్ద ఫ్యాన్ అంట‌. కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉండేవాడ‌ట‌. ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఇందిర దాస‌రికి ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలుస్తోంది. అంతేకాదు.. ఈనాడు ప‌త్రిక‌లో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా క‌థ‌నాలు వ‌స్తే.. దాస‌రి ఉద‌యం పత్రికను ప్రారంభించి ఎన్టీఆర్ కి వ్య‌తిరేకంగా వార్త‌లు రాయించార‌ట‌. ఎన్టీఆర్ రెండ‌వ సారి ఓడిపోవ‌డానికి దాస‌రి నారాయ‌ణ‌రావు కూడా ఓ కార‌ణ‌మ‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  నెట్టింట రౌడీ ఫ్యాన్స్ వ‌ర్స‌స్ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ….ఆంటీ అంటూ దారుణ‌మైన ట్రోలింగ్..!

Visitors Are Also Reading