Home » ఎన్టీఆర్ పాతాల‌భైర‌వి రెమ్యున‌రేష‌న్…రోజుకు రెండు ఇడ్లీలు ఒక‌వ‌డతో పాటూ నెల‌కు ఎన్ని రూపాయలంటే..?

ఎన్టీఆర్ పాతాల‌భైర‌వి రెమ్యున‌రేష‌న్…రోజుకు రెండు ఇడ్లీలు ఒక‌వ‌డతో పాటూ నెల‌కు ఎన్ని రూపాయలంటే..?

by AJAY
Ad

తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో ఎన్టీరామారావు ఒక సంచ‌లనం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయ‌నే ఒక బ్రాండ్ గా మారిపోయారు. వ‌రుస హిట్ల‌ను అందుకుని స్టార్ హీరోగా ఎదిగారు. ఒకే ర‌క‌మైన పాత్ర‌ల‌కు ఫిక్స్ అవ్వ‌కుండా పౌరాణిక, జాన‌ప‌ద చిత్రాల‌తో టాలీవుడ్ లో చెర‌గ‌ని ముద్ర‌వేసుకున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ఉన్నాయి.

Advertisement

ఆ సినిమాలు ఇప్పుడు టీవీలో వ‌చ్చినా కూడా జ‌నాలు ఎగ‌బ‌డి చూస్తుంటారు. ఇక ఎన్టీఆర్ ప్ర‌తి విష‌యంలోనూ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉండేవారు. అంతే కాకుండా తాను క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును అవ‌స‌రం అయితే ఖ‌ర్చు చేసేవారు. త‌న‌ది కాని డ‌బ్బు కోసం ఎప్పుడూ ఆశ‌ప‌డేవారు కాద‌ట‌. మ‌రోవైపు స్టార్ స్టేట‌స్ వ‌చ్చినా అడిగితే నిర్మాత‌లు ఎక్కువ రెమ్యున‌రేషన్ ఇవ్వ‌డానికి రెడీ గా ఉన్నా కూడా ఎన్టీఆర్ డిమాండ్ చేసేవార‌ట‌.

Advertisement

నిర్మాత‌ల‌కు కూడా గిట్టుబాటు అవ్వాలి క‌దా అని చెప్పేవార‌ట‌. త‌న సినిమాల్లోని న‌టులు ఎక్కువ పుచ్చుకున్నా కూడా ఎన్టీఆర్ మాత్రం త‌న క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లాన్ని మాత్ర‌మే ఆశించేవారు. ఇక తాజాగా ఎన్టీఆర్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా పాతాల భైర‌వి రెమ్యున‌రేష‌న్ వైర‌ల్ అవుతోంది.

1951 లో ఈ సినిమా విడుద‌లై ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చింది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ప్ర‌తి రోజూ క‌ర్ర‌సామును నేర్చుకునేవారు. అప్పుడు ప్ర‌తి రోజు ఎన్టీఆర్ కు స్టూడియోలోనే ఇడ్లీలు, వ‌డ టిఫిన్ గా పెట్టేవార‌ట‌. అంతే కాకుండా నెల‌కు రూ.250 రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్ తీసుకునేవార‌ట‌. అయితే ఆ రోజుల‌లో ఎన్టీఆర్ పుచ్చుకున్న రెమ్యున‌రేష‌న్ ఎక్కువ‌నే చెప్పాలి.

Visitors Are Also Reading